Garuda Purana: హిందూ పురాణాలలో గరుడ పురాణానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మరి, గరుడ పురాణం ప్రకారం కొందరికి పుట్టుకతోనే అదృష్టవంతులు అవుతారు. వారికి ఏ విషయంలోనూ లోటు ఉండదు.
Garuda Purana: మన చుట్టూ ఉన్న కొంతమందిని చూసినప్పుడు.. మనకు అబ్బ వీళ్లు ఎంత అదృష్టవంతులో అనే భావన కలుగుతుంది. వారికి డబ్బుకు లోటు ఉండదు. అన్నింట్లోనూ విజయాలు సాధిస్తారు. వారికి ఆ అదృష్టం పుట్టుకతోనే వస్తుందంటే మీరు నమ్ముతారా? గరుడ పురాణం మనం చేసే కర్మల ఆధారంగా మన జీవితం, మన అదృష్టం ఆధారపడి ఉంటుంది. మరి, ఈ గరుడ పురాణం ప్రకారం ఎవరికి ఎక్కువ అదృష్టం ఉంటుందో తెలుసుకుందాం...
24
మధురమైన మాటలు మాట్లాడేవారు...
అదృష్టంతో జన్మించిన వ్యక్తులు ఎల్లప్పుడూ మధురమైన మాటలు మాట్లాడతారు. వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు సరళమైన భాషను ఎంచుకుంటారు. సున్నితమైన జీవనశైలిని ఫాలో అవుతారు. మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు తమ చుట్టూ ఉండే ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. ఇతరులను అవమానించరు. వారి భావాలను కాయపరచరు. ఇతరులను బాధపెట్టరు. మీరు వారిని చూసినప్పుడు, ఒక సున్నితమైన ఆత్మ మానవ రూపంలో దిగి వచ్చినట్లుగా అందరికీ అనిపిస్తుంది.
34
నిస్వార్థ వ్యక్తులు....
మీరు మీ చుట్టూ ఉన్నవారిని గమనిస్తే.... చాలా మంది నిస్వార్థంగా ఉంటారు. ఇతరుల నుంచి ఏమీ ఆశించరు. ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా తమకు తోచిన సహాయం చేస్తూ ఉంటారు. తమ సొంత ఆనందం కంటే... ఇతరుల ఆనందానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందరూ సంతోషంగా ఉంటే.. తాము సంతోషంగా ఉన్నట్లే భావిస్తారు.
ఆకర్షించే అందం...
చాలా మంది ఆకర్షించే అందంతో ఉంటారు. చక్కటి ఆహార్యంతో పాటు.. మంచి దంతాల వరస కూడా కలిగి ఉంటారు. ఇలాంటి వారు గత జన్మలో చాలా మంచి కార్యాలు చేసి ఉంటారు అని గరుడ పురాణం చెబుతుంది. వారి మంచి కర్మలకు తగినట్లే... వీరికి ఈ జన్మలో అదృష్టం ఎక్కువగా ఉంటుంది. వీరి అందానికి ఎవరైనా ఫిదా అయిపోతారు.
ఆచార్య చాణక్యుడు తన ఒక శ్లోకంలో మంచి వ్యక్తిత్వం ఉన్న లక్షణాలను వివరించాడు. "స్వర్గవాసి జన కే సదా, చర చిహ్న లఖి ఏహి, దేవ్ ప్రియ పూజ మధుర, వాక్య దాన కరి దేహి." ఈ శ్లోకం ప్రకారం, స్వర్గం నుండి తిరిగి వచ్చి భూమిపై జన్మించిన వారిలో నాలుగు ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉంటాయి. మొదటిది దయ, రెండవది కరుణ, మూడవది ఇతరుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం, నాల్గవది పేదలకు, జంతువులకు , నిస్సహాయులకు సహాయం చేయడం. ఈ లక్షణాలు ఉన్నవారు పుట్టుకతోనే దేవుని ఆశీర్వాదాలతో జన్మిస్తారు.