Vinayaka Chavithi: వినాయక చవితి రోజు గజకేసరి యోగం..ఈ రాశులకు అదృష్ట కాలం..!

Published : Aug 27, 2025, 12:52 PM IST

వినాయక చవితి రోజు అంటే ఆగస్టు 27వ తేదీన గజకేసరి యోగం ఏర్పడుతోంది. ఈ గజకేసరి యోగంతో పాటు.. మరి కొన్ని శుభ యోగాలు కూడా ఏర్పడనున్నాయి. వాటి ఫలితంగా కొన్ని రాశులవారికి ఊహించిన మేలు జరగనుంది. 

PREV
16
Zodiac signs

వినాయక చవితి రోజే గజ కేసరి యోగంతో పాటు... ధన లక్ష్మీ యోగం ఏర్పడుతోంది. ఈ రెండింటి అరుదైన కలయిక శుభ ఫలితాలను ఇవ్వనుంది. అందులోనూ ఈ రెండు యోగాలు చిత్త నక్షత్రంలో కలవడం మరింత శుభ పరిమాణంగా మారింది. అదేవిధంగా గజకేసరి యోగం, చంద్రుడు, బృహస్పతి ద్వారా నవపంచమి యోగం కూడా ఏర్పడుతోంది. మరి, ఈ శుభ పరిమాణాలన్నీ.. కొన్ని రాశుల వారికి మంచి ప్రయోజనాలు కలిగించనున్నాయి. కష్టాలన్నీ తీరిపోనున్నాయి. మరి, ఏ రాశులకు ఈ అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం...

26
1.మేష రాశి...

మేష రాశిలో జన్మించిన వారు ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు పనిలో విజయం, సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. దీని కారణంగా చేపట్టిన ఏ పనిలో అయినా విజయం సాధించగలరు. ఆర్థిక విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఉద్యోగంలో ఏవైనా సమస్యలు ఉన్నా ఈ వినాయక చవితి రోజున తీరిపోయే అవకాశం ఉంది. దంపతుల మధ్య సమస్యలు తీరి, సఖ్యత పెరుగుతుంది.

36
2.వృషభ రాశి..

వినాయక చవితి వృషభ రాశి వారి జీవితంలో ఊహించని శుభఫలితాలు తీసుకురానుంది. ఏదైనా క్రియేటివ్ పనిలో మంచి ప్రయోజనాలు పొందుతారు. జీవితంలో అన్ని సమస్యల నుంచి ఈరోజు మీరు బయటపడతారు. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీ తెలివి తేటలు పెరుగుతాయి. మీరు ముఖ్యమైన నిర్ణయాలు సులభంగా తీసుకుంటారు. ఉద్యోగంలో మంచి పురోగతి సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడిని పొందుతారు. మానసికంగా బలంగా మారతారు. కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే.. ఉపశమనం పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది.

46
3.తుల రాశి...

తుల రాశివారికి వినాయక చవితి అదృష్టాన్ని మోసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆత్మవిశ్వాసం, సామర్థ్యం పెరుగుతుంది. పనిలో మంచి పురోగతి సాధిస్తారు. ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే... మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. డబ్బు ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఏ రంగంలో పని చేసినా.. విజయం సాధిస్తారు. మీ ఆలోచనలన్నీ విజయవంతమౌతాయి.

56
4.ధనస్సు రాశి..

ధనస్సు రాశివారికి వినాయకచవితి శుభాలను మోసుకొస్తుంది. వివిధ వనరుల నుంచి డబ్బు పొందే అవకాశం ఉంది. మంచి లాభాలను ఆర్జించగలరు. పాత కోరికలు నెరవేరతాయి. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. స్నేహితుల సర్కిల్ పెరుగుతుంది. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. మీరు కార్యాలయంలో కొత్త విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతి పొందే అవకాశం ఉంది. జీతం పెరుగుతుంది. కుటంబ సపోర్ట్ లభిస్తుంది.

66
5.కుంభ రాశి..

కుంభ రాశివారికి వినాయక చవితి తర్వాత చాలా మేలు జరుగుతుంది. పండగ తర్వాత ఈ రాశివారికి అదృష్టం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు కోరుకున్న ఉద్యోగం పొందవచ్చు. దీనితో పాటు.. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారవేత్తలకు దూర ప్రయాణాలకు అవకాశం లభిస్తుంది. ప్రయాణం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ మద్దతు లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories