సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవాళ్లు స్నేహం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన ఒక్క ఫ్రెండ్ ఉన్న చాలు.. వారు అదృష్టవంతులే. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు స్నేహం కోసం స్ట్రాంగ్ గా నిలబడతారో ఇక్కడ చూద్దాం.
సంఖ్యాశాస్త్రం ఆధారంగా వ్యక్తుల స్వభావాన్ని తెలుసుకోవచ్చు. సంఖ్యాశాస్త్రంలో మూలసంఖ్యకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. పుట్టిన తేదీ ఆధారంగా మూలసంఖ్య లెక్కించబడుతుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. స్నేహం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు స్నేహితుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయరో ఇక్కడ తెలుసుకుందాం.
సంఖ్యా శాస్త్రం ప్రకారం మూల సంఖ్య 1 కలిగిన వ్యక్తులు స్నేహం కోసం ఏమైనా చేస్తారట. ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 1 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. జ్యోతిష్యంలో సూర్యుడుని వ్యక్తిత్వం, నాయకత్వం, ఆరోగ్యం, అధికారం, ఆత్మ విశ్వాసాలకు కారకుడిగా భావిస్తారు.
24
ఈ తేదీల్లో పుట్టినవారు ఎలా ఉంటారంటే?
ఏ నెలలో అయినా ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారు చాలా నిజాయితీగా బ్రతుకుతారు. ఎవరినీ మోసం చేయడానికి వీరు ఇష్టపడరు. ఈ వ్యక్తిత్వమే వారిని అందరిలో ప్రత్యేకంగా చూపిస్తుంది. ఈ తేదీల్లో పుట్టినవారు కుటుంబాన్ని, స్నేహితులను అమితంగా ప్రేమిస్తారు. అయితే వీరికి కోపం కూడా కొంచెం ఎక్కువే.
34
వీరి భవిష్యత్ ఎలా ఉంటుందంటే?
సంఖ్యా శాస్త్రం ప్రకారం మూల సంఖ్య 1 కలిగిన వ్యక్తులు చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఏ పని మొదలు పెట్టినా పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. ఈ తేదీల్లో పుట్టిన వారు మంచి వ్యాపారవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంది.
సంఖ్యా శాస్త్రం ప్రకారం.. ఏ నెలలో అయినా ఈ నాలుగు తేదీల్లో పుట్టినవారు స్నేహ బంధంలో చాలా నిజాయితీగా ఉంటారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో వీరు ముందుంటారు. స్నేహితుల ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కష్టకాలంలో స్నేహితులను ఒంటరిగా వదిలిపెట్టరు. ఎప్పుడూ వారికి తోడుగా ఉంటారు. వారి సమస్యలను పరిష్కరించడానికి ముందుంటారు.