Fridge Vastu: వాస్తును చాలా మంది ఫాలో అవుతుంటారు. వాస్తు కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంట్లోని వస్తువులకూ వర్తిస్తుందని పండితులు చెబుతుంటారు. మరి ఫ్రిజ్‌కు సంబంధించిన కొన్ని వాస్తు నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో సానుకూల వాతావరణం ఉండాలంటే వాస్తు చిట్కాలు పాటించడం ముఖ్యం. ప్రస్తుత రోజుల్లో ఫ్రిజ్ అనేది ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉండే ముఖ్యమైన ఉపకరణాల్లో ఒకటి. దీనికి సంబంధించి వాస్తు కొన్ని నియమాలు సూచిస్తుంది. ముఖ్యంగా ఫ్రిజ్‌పై ఏ వస్తువులు పెట్టకూడదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
25
ఫ్రిజ్‌పై తప్పుడు వస్తువులు పెట్టడం ఎందుకు మంచిది కాదు
రోజూ చాలా మంది చిన్నచిన్న వస్తువులు ఫ్రిజ్‌పై పెట్టేస్తారు. కానీ ఇలా చేస్తే ప్రతికూల శక్తి త్వరగా పెరుగుతుందని వాస్తు చెబుతుంది. దీని ప్రభావం ఇంట్లో శాంతి, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం వంటి అంశాలపై పడుతుంది. అందుకే ఫ్రిజ్‌పై ఏమి ఉంచుతున్నామో జాగ్రత్తగా చూడాలి.
35
నీటికి సంబంధించిన వస్తువులు పెట్టకూడదు
వాస్తు ప్రకారం ఫ్రిజ్ అగ్నితత్వ సూచకం. అందుకే దాని పైన నీటితో సంబంధం ఉన్న వస్తువులు పెట్టడం మంచిది కాదు. ఇలా పెడితే.. ఆర్థిక నష్టం, ఇంట్లో తగాదాలు, కుటుంబంలో ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఫిష్ ట్యాంక్, నీటిలో పెరిగే మొక్కలు (మనీ ప్లాంట్ వంటి మొక్కలు) ఫ్రిజ్‌పై పెట్టకూడదు.
ఫ్రిజ్‌పై ట్యాబ్లెట్స్ పెట్టడం మనలో చాలా మందికి అలవాటు ఉంటుంది. సాధారణంగానే ఫ్రిజ్‌పై ఎప్పడూ వేడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రదేశంలో మందులు పెడితే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. వేడి కారణంగా మందులు పాడైపోతాయి. తక్కువ ఉష్ణోగ్రత అవసరమయ్యే మందులు ఉంటే వాటిని ఫ్రిజ్ లోపలే ఉంచడం మంచిది.
55
బరువు ఎక్కువగా ఉండే వస్తువులు
పాడైన వస్తువులు, పనికిరాని వస్తువులు ఫ్రిజ్‌పై ఉంచడం వాస్తులో పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇంట్లో శాంతి తగ్గుతుంది. వీటితో పాటు ఫ్రిజ్‌పై దేవుడి ఫోటోలు, నగదు, నాణేలు, ఓవెన్, ఛార్జర్లు, ట్రోఫీలు, అవార్డులు వంటి వస్తువులు అస్సలు పెట్టకూడదు.