Birth stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు భార్య ఏది చెబితే అదే వింటారు..!

Published : Dec 03, 2025, 11:56 AM IST

Birth Stars: కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలకు సహజంగానే కుటుంబం పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో అందరి కంటే కూడా వీరికి భార్య మీద ప్రేమ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు.  సమయం దొరికినప్పుడల్లా భార్య మాటను జవదాటాలని కూడా అనుకోరు. 

PREV
14
Birth Stars

జోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి స్వభావం, వారు పుట్టిన నక్షత్రం ఆధారంగా చాలా ప్రభావితమౌతుంది. కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు సహజంగా భార్యావిధేయులు. కుటుంబానికి, మరీ ముఖ్యంగా భార్యకు వీరు చాలా విలువ ఇస్తారు. అందరి ముందు భార్యను అమితంగా గౌరవిస్తారు. ఆమెను పూర్తిగా అర్థం చేసుకుంటారు. అంతేకాదు.. ముఖ్యమైన విషయాల్లో భార్య ఏది చెబితే అది మాత్రమే చేస్తారు. మరి, అలా భార్య మాట వినే నక్షత్రాలు ఏంటో ఓసారి చూద్దాం....

24
రోహిణి నక్షత్రం....

రోహిణీ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు సహజంగా ప్రేమ పూర్వక స్వభావం కలిగి ఉంటారు. వీరు భార్యను చాలా ఎక్కువగా ప్రేమిస్తారు.భార్య సంతోషం కోసం ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వివాహ జీవితాన్ని చాలా పవిత్రమైన బంధంగా భావిస్తారు. భార్య చెప్పింది చేయడానికి ఏ మాత్రం వెనకాడరు.

2.అర్ద్ర నక్షత్రం....

ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు కూడా భార్యకు అమితమైన గౌరవాన్ని ఇస్తారు. భార్య మాట వింటారు. ఆమె కోరింది ఇవ్వడానికి ఏ రోజు వెనకాడరు. భార్య చెప్పింది విని.. ఆమె అభిరుచులకు తగినట్లు గా ప్రవర్తిస్తారు. ఆమె చెప్పిన దానిని తూచా తప్పకుండా పాటిస్తారు.

34
3.పుష్య నక్షత్రం....

పుష్య నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు చాలా బాధ్యతతో ఉంటారు. కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఇక..వీరికి ప్రపంచంలో అందరికంటే భార్యే ఎక్కువ. తమ భార్య ఏం చెప్పినా చాలా శ్రద్ధగా వింటారు. ఆమెకు ఏ లోటు రానివ్వరు. ఆమె చెప్పిన ప్రతి పనిని చేస్తారు.

4.హస్త నక్షత్రం....

హస్త నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు చాలా శాంతపరులు. వీరు గొడవలకు చాలా దూరంగా ఉంటారు. భార్యతో మాట్లాడి, ఆమె సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు.

44
5.శతభిష నక్షత్రం....

శతభిష నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు కూడా శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి భార్యపై అమితమైన అభిమానం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ శాంతి కోసం భార్య మాటను గౌరవంగా ఉంటారు. ఆమె బాధపడటం ఇష్టంలేక... చెప్పినదల్లా చేస్తాడు.

Read more Photos on
click me!

Recommended Stories