Mahabharatam: మీ పుట్టిన తేదీని బట్టి మహాభారతంలో మీది ఏ క్యారెక్టరో తెలుసుకోండి

Published : May 28, 2026, 07:23 PM IST

Mahabharatam: సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీని బట్టి ఎన్నో విషయాలు అంచనా వేయచ్చు.  మీ పుట్టిన తేదీని బట్టి  మహాభారతంలోని ఏ పాత్ర లక్షణాలు మీకు అధికంగా ఉన్నాయో తెలుసుకోండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 

PREV
15
పుట్టిన తేదీ: 1, 10, 19, 28

ఈ అంకెల్లో పుట్టిన వారికి అధిపతి సూర్యుడు. ఒకటో నంబర్ వాళ్లు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలతో ఉంటారు. వీరికి సరిపోయే మహాభారత పాత్ర కర్ణుడు. 

పుట్టిన తేదీ: 2, 11, 20, 29

ఈ తేదీల్లో పుట్టిన వారికి అధిపతి చంద్రుడు. వీరికి భావోద్వేగాలు ఎక్కువ.  ఈ నంబర్‌కు సరిపోయే పాత్ర భీష్ముడు. గంగా పుత్రుడైన భీష్ముడు తన త్యాగం, ఓర్పు, భావోద్వేగ స్థిరత్వంతో ఈ సంఖ్యకు తగిన వ్యక్తి.

25
పుట్టిన తేదీ: 3, 12, 21, 30

ఈ తేదీలకు అధిపతి బృహస్పతి (గురుడు). జ్ఞానం, తెలివితేటలు, వివేకం వీరి ప్రధాన లక్షణాలు. వీరికి సరిపోయే మహాభారత పాత్ర గురు ద్రోణాచార్యుడు. 

పుట్టిన తేదీ: 4, 13, 22, 31

వీరికి అధిపతి రాహువు. రాహువు మాయ, భ్రమ, ప్రాపంచిక కోరికలకు సంకేతం. ఈ నంబర్‌కు సరిపోయే పాత్ర దుర్యోధనుడు. దుర్యోధనుడి అహంకారం, అత్యాశ మహాభారత యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి.

35
పుట్టిన తేదీ: 5, 14, 23

ఈ అంకెలకు అధిపతి బుధుడు. తెలివితేటలు, వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి, హాస్యం ఈ అంకెల్లో ఉన్న వారి గుణాలు. ఈ సంఖ్యకు సరిగ్గా సరిపోయే పాత్ర శ్రీకృష్ణుడు. అర్జునుడికి గీతోపదేశం చేసి, యుద్ధంలో పాండవులను నడిపించాడు కృష్ణుడు.

పుట్టిన తేదీ: 6, 15, 24

వీరికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అందం, ప్రేమ, స్త్రీ శక్తికి ప్రతీక. ఈ నంబర్‌కు సరిపోయే పాత్ర ద్రౌపది. ద్రౌపది కేవలం అందానికే కాదు, ధైర్యానికి, ఆత్మాభిమానానికి కూడా ప్రతీకగా నిలుస్తుంది.

45
పుట్టిన తేదీ: 7, 16, 25

ఈ అంకెలకు అధిపతి కేతువు. కేతువు ధర్మానికి, ఆధ్యాత్మికతకు సంకేతం. ఈ నంబర్‌కు సరిపోయే పాత్ర ధర్మరాజు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ధర్మ మార్గాన్ని వీడలేదు.

పుట్టిన తేదీ: 8, 17, 26

ఇక వీరికి అధిపతి శని. శని గ్రహం క్రమశిక్షణ, న్యాయం, కర్మకు ప్రతీక. ఈ నంబర్‌కు సరిపోయే పాత్ర విదురుడు. విదురుడు ఎల్లప్పుడూ సత్యం, న్యాయం, కర్మ గురించి మాట్లాడిన జ్ఞాని.

55
పుట్టిన తేదీ: 9, 18, 27

ఈ అంకెలకు అధిపతి కుజుడు. శక్తి, ధైర్యం, సాహసం ఈ నంబర్ వారి లక్షణాలు. ఈ సంఖ్యకు సరిపోయే పాత్ర భీముడు. అపారమైన బలం, ధైర్యం, నిర్భయమైన గుణంతో భీముడు అందరికీ సుపరిచితుడు. 

Read more Photos on
click me!

Recommended Stories