Sun moon Conjuction: జూన్‌లో సూర్య చంద్రుల కలయికతో ఈ 4 రాశుల వారికి డబుల్ హ్యాపీనెస్

Published : May 28, 2026, 12:38 PM IST

Sun moon Conjuction: ప్రధాన గ్రహాలైన సూర్య చంద్రులు కలిసి జూన్‌లో వైధృతి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం చాలా శక్తివంతమైనది. జూన్ 4వ తేదీన సాయంత్రం 6:09 గంటలకు ఈ యోగం ఏర్పడుతుంది.  దీనివల్ల 4 రాశులకు రెట్టింపు ఆనందం, ఆదాయం దక్కుతుంది.

PREV
14
వృషభ రాశి

వృషభ రాశి వారికి జూన్ నెల బాగా కలిసి వస్తుంది. ఈ రాశివారికి మంచి రోజులు రానున్నాయి.  స్నేహితులతో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. ప్రేమలో ఉన్నవారు ఆ బంధాన్ని మరింత బలపరచుకుంటారు. వీరికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత దక్కుతుంది. మనసులో ఉన్న అనవసర భయం, ఆందోళనలు తొలగిపోతాయి. వ్యాపారం చేస్తున్న వారికి పెద్ద లాభాలు కలిగే అవకాశం ఉంది. సూర్య చంద్రుల కలయిక వల్ల ఏర్పడే యోగం ఈ రాశి వారికి మంచి సమయాన్ని ఇస్తుంది. ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి.

24
కర్కాటక రాశి

సూర్య చంద్రలు కలయిక వల్ల  కర్కాటక రాశి వారికి కూడా మంచి కాలం రాబోతోంది. సూర్య, చంద్రుల వల్ల ఏర్పడే వైధృతి యోగం వల్ల వీరికి ఎంతో లాభాలు కలుగుతాయి. వీరు చేద్దామనకుని  చాలాకాలంగా ఆగిపోతున్న పనులు ఈ నెలలో పూర్తవుతాయి. ఇక ఉద్యోగం చేస్తున్నవారికి మంచి పురోగతి కనిపిస్తుంది. ఈ రాశి వారి ముందు అనేక కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్తగా ఏదైనా ప్రారంభించే అవకాశం ఉంది. మంచ గౌరవం పొందుతారు.

34
సింహ రాశి

ఈ యోగం వల్ల సింహ రాశి వారికి సానుకూల ప్రభావాలు కలుగుతాయి. వివాహం కానివారికి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ఈ రాశి వారికున్న  డబ్బు సమస్యలు కూడా తీరిపోతాయి. వ్యాపారం చేస్తున్నవారికి కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది. అప్పుల నుంచి బయటపడతారు.  సమాజంలో గౌరవం పెరుగుతుంది. 

44
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ రాశి వారికి అంతా శుభమే జరుగుతుంది. జీవితంలోని కష్టాలు, ఇబ్బందుల నుంచి వీరికి ఉపశమనం లభిస్తుంది. అలాగే డబ్బు కొరత కూడా తీరుతుంది. ఈ రాశివారికి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఒక వ్యాపారంలో ఉన్నవారికి మంచి పురోగతి కనిపిస్తుంది. వీరికి కొత్త ప్రాజెక్ట్ దక్కే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories