Zodiac signs: ఈ రాశివారు ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టారంటే.. అందరి కళ్లూ వీరిపైనే..!

Published : Jan 15, 2026, 08:12 AM IST

Zodiac signs:జోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి రాశికీ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అయితే, కొన్ని రాశుల వారికి సహజంగానే అయస్కాంతం లాంటి ఆకర్షణ ఉంటుంది. వారు బయటకు వెళితే చాలు.. అందరి కళ్లు వారిపైనే ఉంటాయి. వీరికి దిష్టి తగిలే అవకాశం కూడా చాలా ఎక్కువ. 

PREV
13
వృషభ రాశి..

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అందం, విలాసం, ఆకర్షణకు కారకుడు. ఈ రాశివారు చాలా క్లాసిక్ లుక్ లో ఉంటారు. వీరి కళ్లు, ఆహార్యం చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మీరు సాధారణ దుస్తులు వేసుకున్నా సరే, చాలా అందంగా కనిపిస్తారు. అందుకే వీరు జనాల్లోకి వెళ్లినప్పుడు అందరి దృష్టి వీరిపైనే ఉంటుంది.

23
తుల రాశి..

తుల రాశికి కూడా అధిపతి శుక్రుడు. వీరు అందాన్ని ఆరాధించడమే కాకుండా, తాము కూడా ఎప్పుడూ అందంగా ఉండాలని కోరుకుంటారు. వీరికి ఫ్యాషన్ సెన్స్ చాలా ఎక్కువ.ఏ సందర్భానికి ఎలా తయారవ్వాలో వీరికి బాగా తెలుసు. వీరి నవ్వు, మాట్లాడే తీరు ఎదుటివారిని ఇట్టే కట్టేస్తాయి. వీరు ఎక్కడికి వెళ్లినా ఒక ప్రత్యేకమైన కళతో కనిపిస్తారు.

33
వృశ్చిక రాశి...

వృశ్చిక రాశి వారు కూడా చాలా అందంగా ఉంటారు. చాలా రహస్యంగా కూడా ఉంటారు. వీరి ముఖంలో ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది. వీరి కళ్లల్లో కూడా ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. వీరిని ఒకసారి చూస్తే ఎవరూ ఈజీగా మర్చిపోలేరు. వీరి పర్సనాలిటీ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది కాబట్టి, సహజంగానే వీరిపై ఇతరుల కళ్లు పడుతుంటాయి.

4.సింహ రాశి...

సింహ రాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు లాగా వీరు కూడా వెలిగిపోతుంటారు. వీరు నలుగురిలో ఉన్నప్పుడు చాలా రాయల్ గా కనిపిస్తారు. వీరి నడక, ఆత్మవిశ్వాసం వీరిని అందరికంటే ప్రత్యేకం చేస్తాయి. స్టేజ్ మీద ఉన్నా, ఫంక్షన్ లో ఉన్నా అందరి కళ్లు వీరిని వెతుకుతాయి. అందుకే వీరికి త్వరగా నర దిష్టి తగులుతుంది.

5.మీన రాశి...

మీన రాశివారు చాలా సున్నితమైన, అమాయకమైన అందాన్ని కలిగి ఉంటారు.వీరిని చూడగానే ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. వీరి ముఖంలో ఉండే స్వచ్ఛత ఇతరులను ఆకట్టుకుంటుంది. వీరి కళ్లలో ఉండే లోతు చూసేవారిని మంత్ర ముగ్ధులను చేస్తుంది.

దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

మీరు పైన చెప్పిన రాశుల వారైతే లేదా మీరు బయటకు వెళ్లినప్పుడు దిష్టి తగులుతుందని అనిపిస్తే, ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోండి..

ఒక చిన్న నల్ల చుక్కను చెవి వెనక లేదా పాదానికి పెట్టుకోవాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు కుల దైవాన్ని స్మరించుకోవాలి. తిరిగి ఇంటికి వచ్చాక ఉప్పుతో దిష్టి తీయించుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories