Dream Astrology: కలలో ఇవి కనిపిస్తే జాగ్రత్త.. చెడుకి సంకేతాలు కావచ్చు!

Published : Jun 24, 2026, 05:45 PM IST

Dream Astrology: మన నిద్రలో కనిపించే కలల వెనుక కొన్ని లోతైన అర్థాలుంటాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. కొన్ని కలలు మన జీవితంలో జరిగే మార్పులు, మానసిక స్థితి లేదా రాబోయే సమస్యలకు సంకేతాలు కావచ్చు. అందుకే కొన్ని కలలను నిర్లక్ష్యం చేయకూడదు. అవేంటో చూద్దాం

PREV
16
ఎలాంటి కలలు వస్తే జాగ్రత్తగా ఉండాలి?

సాధారణంగా మనం నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు రకరకాల భావాలు, అనుభవాలు, భయాలు, ఆలోచనలను కలల రూపంలో చూపిస్తుంది. అయితే కొన్ని కలలు భవిష్యత్తులో జరిగే సంఘటనలకు సంకేతాలని స్వప్న శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా కొన్ని కలలు వస్తే చెడు జరిగే సూచనలు ఎక్కువట. మరి ఏ కలలు వస్తే అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

26
కలలో అగ్ని కనిపించడం

సాధారణంగా అగ్ని.. శక్తి, మార్పు సూచన అయినప్పటికీ, అది నియంత్రణ లేకుండా మండుతున్నట్లు కనిపిస్తే అది కోపం, విభేదాలు లేదా సమస్యలు పెరిగే అవకాశం ఉందని సూచన. ముఖ్యంగా కుటుంబ లేదా వ్యక్తిగత సంబంధాల్లో అపార్థాలు రావచ్చని స్వప్న శాస్త్రం చెబుతోంది.

36
కలలో చీకటి ప్రదేశాలు కనిపించడం

స్వప్న శాస్త్రం ప్రకారం చీకటి ప్రదేశాలు, తప్పిపోయినట్లు కలలు రావడం కూడా ముఖ్యమైన సంకేతం. మీరు దారి తప్పినట్లు, చీకటిలో నడుస్తున్నట్లు లేదా ఎక్కడికో చేరలేకపోతున్నట్లు కల వస్తే, అది జీవితంలో గందరగోళం, నిర్ణయాలపై అనిశ్చితి లేదా దిశ లేకపోవడాన్ని సూచించవచ్చు.

46
కలలో పాము కనిపించడం

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో పాము కనిపించడం ఒక ముఖ్యమైన సంకేతం. సాధారణంగా పాము కలలో కనిపించడం రెండు అర్థాలను కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది మార్పు లేదా శక్తిని సూచించవచ్చు. కానీ పాము దాడి చేస్తున్నట్లు లేదా భయంకరంగా కనిపిస్తే, అది మానసిక ఒత్తిడి, శత్రువుల ప్రభావం లేదా రాబోయే సమస్యలకు సంకేతం కావచ్చు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని స్వప్న శాస్త్రం సూచిస్తోంది.

56
కలలో చనిపోయిన వ్యక్తులు వస్తే?

అలాగే కలలో చనిపోయిన వ్యక్తులు కనిపించడం కూడా చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది పూర్తిగా అపశకునం అని చెప్పలేము. కానీ కొన్ని సందర్భాల్లో ఇది మనసులో ఉన్న పాత జ్ఞాపకాలు, అపరిష్కృత భావాలు లేదా భావోద్వేగ ఒత్తిడిని సూచించవచ్చు. అయితే చనిపోయిన వ్యక్తి ఏదైనా హెచ్చరిస్తున్నట్లు కల వస్తే, దాన్ని జాగ్రత్త సూచనగా తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.

66
పై నుంచి పడిపోతున్నట్లు కల వస్తే?

కలలో మురికి నీరు, వరదలు లేదా నీటిలో మునిగిపోవడం వంటి దృశ్యాలు కనిపిస్తే, అది భావోద్వేగ అస్థిరత లేదా జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సంకేతం. స్వప్నశాస్త్రం ప్రకారం నీరు మన భావోద్వేగాలను సూచిస్తుంది. నీరు అస్థిరంగా లేదా మురికిగా కనిపిస్తే, మన మనసు కూడా అస్థిరంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎత్తైన ప్రదేశం నుంచి పడిపోతున్నట్లు కల వస్తే, అది ఆత్మవిశ్వాసం తగ్గడం, భయం లేదా జీవితంలో నియంత్రణ కోల్పోతున్న భావనను సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితులకు సంకేతం కూడా కావచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories