Dhan Shakti Rajyoga: వృశ్చిక రాశిలోకి శుక్రుడు... నవంబర్ లో మూడు రాశులకు ధనయోగం..!

Published : Sep 22, 2025, 11:49 AM IST

 Dhan Shakti Rajyoga: నవంబర్ లో శుక్రుడు... వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ శుక్ర సంచారం ధన శక్తి రాజయోగాన్ని ఏర్పరచనుంది. ఈ యోగం... మూడు రాశుల వారికి అదృష్టాన్ని మోసుకురానుంది. 

PREV
14
Zodiac signs

వేద జోతిష్య శాస్త్రం ప్రకారం.. సంపద, ప్రేమకు శుక్ర గ్రహాన్ని ప్రతీకగా పరిగణిస్తారు. ఈ శుక్రుడు ధన శక్తి రాజయోగాన్ని సృష్టంచబోతున్నాడు. ఇక.. నవంబర్ 26న ... శుక్ర గ్రహం వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఆల్రెడీ కుజుడు, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. దీని కారణంగా... ఈ శుక్ర గ్రహం.. ధన శక్తి రాజయోగాన్ని ఏర్పరచనుంది. ఈ రాజయోగం... కొన్ని రాశుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపించనుంది. దీని ప్రభావం కారణంగా... ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా... ఊహించని లాభాలు కూడా కలగనున్నాయి. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి సహాయపడుతుంది. మరి.. ఈ ధనయోగం ఏ రాశులకు కలగనుందో... ఎవరి ఫేట్ మారనుందో ఇప్పుడు తెలుసుకుందాం....

24
1వృషభ రాశి....

ధనశక్తి రాజయోగం... వృషభ రాశివారి ఆర్థిక జీవితాన్ని చాలా ఎక్కువగా మెరుగుపరచనుంది. ఇబ్బందుల్లో ఉన్న వృషభ రాశివారికి ఈ సంవత్సరం వారి ఆర్థిక పరిస్థితి చాలా బాగా మెరుగుపడుతుంది. శుక్ర గ్రహం వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టినప్పటి నుంచి వృషభ రాశివారికి విజయావకాశాలు పెరుగుతాయి. ఏ పని మొదలుపెట్టినా వారికి సక్సెస్ లభిస్తుంది. వివిధ వ్యాపారాల నుంచి డబ్బు సంపాదిస్తారు. వృత్తిపరంగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలరు. కోల్పోయిన డబ్బు తిరిగి పొందుతారు.వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా... అవి తగ్గిపోయి అవకాశం ఉంటుంది.

34
2.కన్య రాశి....

ధన శక్తి రాజయోగం కన్య రాశివారి జీవితంలో సానుకూల ఫలితాలను తీసుకురానుంది. కుటుంబ జీవితంలో శాంతి, ఆనందం ఉంటుంది. మీ జాతకంలో శుక్రుడు, కుజుడు 4వ ఇంట్లో ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ కృషి ద్వారా కీర్తి పెరుగుతుంది. కన్యరాశి వారికి వివిధ రంగాలలో డబ్బు సంపాదించే అవకాశాలు లభిస్తాయి. అలాగే, డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీకు విదేశాలలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇది మీ కెరీర్‌కు కొత్త దిశను అందిస్తుంది. కన్యరాశి వారు విజయంతో తమ లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపారం , పరిశ్రమలలో లాభాలు ఆర్జించే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అపారంగా మెరుగుపడుతుంది.

44
3.సింహ రాశి....

సింహ రాశి వారికి ధన శక్తి రాజయోగం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. వివిధ రంగాలలో వ్యాపార విస్తరణ అవకాశాలు ఉన్నాయి. వారు వారి కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. వారి ప్రేమ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో, మీరు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. మీరు ఎక్కువ డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. వృత్తిపరమైన జీవితంలో మీ విశ్వాసం పెరుగుతుంది, కొత్త ఆదాయ వనరులు తెరుచుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. మీరు భవిష్యత్తు కోసం ఎక్కువ ఆదా చేస్తారు. పాత స్నేహితులను కలిసే అవకాశాలు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories