Zodiac signs: అక్టోబర్‌లో 5 గ్రహాల సంచారం, ఈ రాశుల వారు బంపర్ లాటరీ కొట్టినట్టే

Published : Sep 22, 2025, 11:18 AM IST

అక్టోబర్ నెలలో చాలా గ్రహాలు తమ రాశులను (Zodiac signs) మార్చుకోబోతున్నాయి.  ముఖ్యంగా అయిదు గ్రహాల సంచారాల వల్ల కొన్ని రాశుల వారికి బీభత్సంగా ఆర్ధికంగా కలిసి వస్తుంది. అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.

PREV
16
అక్టోబర్‌లో ప్రధాన రాశి సంచారం

అక్టోబర్‌ నెలలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు, కుజుడు రాశులు మారుతున్నారు. దీనివల్ల నవపంచ యోగం, మాళవ్యం యోగం, రుచకం రాజయోగాలు ఏర్పడతాయి. ఈ గ్రహ మార్పులు అయిదు రాశులకు శుభ ఫలితాలను అందిస్తాయి.

26
కుంభ రాశి

కుంభ రాశి వారికి అక్టోబర్ ఎంత కలిసి వస్తుంది. శని వక్ర సంచారం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది. సగంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఇంట్లో సంపద పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.

36
మేష రాశి

మేష రాశికి అక్టోబర్ విపరీతంగా కలిసొచ్చే నెల. వారికి కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఊహించని పురోగతి ఉంటుంది. వాక్చాతుర్యంతో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

46
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల ఎంతో ఆనందాన్నిస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్త వాహనం లేదా ఆస్తి కొనే అవకాశం ఉంది. వ్యాపారులకు భారీ లాభాలు వస్తాయి. అవివాహితులకు పెళ్లి సెటిలయ్యే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

56
సింహ రాశి

సింహ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అప్పులు తగ్గుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికందిస్తుంది.  పూర్వీకుల ఆస్తి చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు తీరి, బంధాలు బలపడతాయి.

66
ధనూ రాశి
ధనుస్సు రాశికి అక్టోబర్ చాలా ప్రత్యేకం. అదృష్టం కలిసి వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. జీతాల పెంపు ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
Read more Photos on
click me!

Recommended Stories