చాలాసార్లు కుక్కలు రాత్రిపూట గట్టిగా ఏడుస్తుంటాయి. ఈ ఏడుపు మంచిది కాదని పెద్దలు చెబుతారు. రాత్రిపూట కుక్క ఏడవడాన్ని అశుభంగా పరిగణిస్తారు. దీనివల్ల ఊరిలో ఎవరో ఒకరు చనిపోతారని భావిస్తారు. అసలు కుక్క ఏడవడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం
ఇంటి బయట లేదా ఇంటి గుమ్మం ముందు కుక్క ఏడిస్తే అది కొన్ని జబ్బులను సూచిస్తుందట. కుటుంబంలో ఎవరైనా పెద్ద వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని నమ్ముతారు. రాత్రిపూట కుక్క ఏడిస్తే అది ఏదో పెద్ద దురదృష్టాన్ని సూచిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకే కుక్క ఇంటి బయట ఏడవకూడదు అంటారు పెద్దలు.
కుక్క ఏడిస్తే ఆర్థిక నష్టం వస్తుందా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుక్కల ఏడుపు ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది. భవిష్యత్తులో కొన్ని పనుల వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉందని సూచిస్తుంది. ఇది ఎక్కువ ఖర్చు అవ్వడానికి కారణం కావచ్చు. ఏ ఇంటి బయట అయినా కుక్క ఏడిస్తే వారు ఏదో చెడ్డ వార్త వినాల్సి వస్తుంది. ఇంటి చుట్టుపక్కల నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా కుక్కలు ఏడుస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కుక్కలు కొన్ని సహజ సంఘటనలను ముందుగానే గ్రహిస్తాయని పెద్దలు చెబుతారు. అందుకే కుక్కలు ముందే ఏడవడం మొదలు పెడతాయట. కొన్ని నమ్మకాల ప్రకారం.. కుక్కలు తమ చుట్టుపక్కల కొన్ని దుష్ట శక్తులు ఉన్నప్పుడు ఎక్కువగా ఏడుస్తాయట. అందుకే ఇంటి చుట్టుపక్కల కుక్కలు ఏడిస్తే వాటిని అక్కడి నుంచి తరిమేస్తారు.