Ugadi Rashi Phalalu: విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశిఫలాలు

ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో ఎనిమిదో  రాశి అయిన వృశ్చిక రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.

Ugadi 2025 vrischika rashi phalalu scorpio Horoscope Yearly Predictions for scorpio Rashi in Vishvavasu Nama Samvatsara Financial Gains, Challenges in telugu ram
Ugadi 2025 vrischika rashi phalalu scorpio Horoscope

వృశ్చిక రాశి ఆదాయం-2, వ్యయం-14, రాజ్యపూజ్యం-5, అవమానం-2

2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో ఎనిమిదో  రాశి అయిన వృశ్చిక రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.


విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి మిశ్రమ ఫలితాలు అందనున్నాయి. గురుడు ఏడాది మొదట్లో వృషభంలో సంచరించడం వల్ల కొన్ని శుభ ఫలితాలు పొందుతారు.ఆర్థికంగా కొంత నిలదొక్కుకుంటారు. కానీ, అదేవిధంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. శని మీన రాశిలో సంచరించడం వల్ల కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని చికాకులు ఎదురైనా ఉద్యోగ, వ్యాపారాలు మాత్రం చాలా మంచిగా వృద్ధి చెందుతాయి.
 

విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి..
ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అకస్మాత్తుగా డబ్బు రావొచ్చు, కానీ అదికూడా తగిన విధంగా ఖర్చు చేయాలి. స్థిరాస్తి కొనుగోలు లేదా పెట్టుబడులకు అనుకూల సమయం కాదు. వ్యాపారస్తులకు లాభనష్ట సమంగా ఉంటుంది. మే నుండి రాహువు కుంభ రాశిలోకి వెళ్తే ఆర్థికంగా కొన్ని సానుకూల మార్పులు కనబడతాయి. రుణాల మీద ఎక్కువ ఆధారపడకూడదు.
 


విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఆరోగ్య పరిస్థితి

శని మీన రాశిలో ఉండటంతో ఆరోగ్యపరమైన సమస్యలు కొంత బాధించవచ్చు. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. గురుడు అష్టమస్థానంలో ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, నిద్రలేమి కలగవచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.

విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఉద్యోగం & వ్యాపారం

ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు. అయితే, పని ఒత్తిడి పెరుగుతుంది. పదోన్నతికి అవకాశాలు ఉంటాయి, కానీ సహోద్యోగులతో సమన్వయం తప్పనిసరి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు. కొన్ని నెలలు లాభదాయకంగా ఉంటే, కొన్ని నెలల్లో సమస్యలు ఎదురవుతాయి. కొత్త పెట్టుబడులకు ముందు పూర్తి పరిశీలన చేయాలి.
 

మాసవారీ రాశిఫలితాలు

ఏప్రిల్ 2025

ఈ నెల కొంత ప్రతికూలంగా ఉంటుంది. అధిక ఖర్చులు, ఒత్తిడులు, నిరుత్సాహం ఎదురవుతాయి. అపజయాలను ఎదుర్కొనే అవసరం ఉండొచ్చు.

మే 2025

ఈ నెల అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి లాభాలు, కొత్త అవకాశాలు, కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరగవచ్చు. కోర్టు వ్యవహారాల్లో విజయం.

జూన్ 2025

వ్యతిరేక భావాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు పెరుగుతారు. కుటుంబంలో విభేదాలు తలెత్తవచ్చు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి.

జూలై 2025

అనుకూల ఫలితాలు. ధన లాభం, స్నేహితుల సహాయం, శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది.

ఆగస్టు 2025

అనుకూలం కాదు. అనవసర ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార పరంగా ఆటంకాలు. మితంగా వ్యవహరించడం మంచిది.

సెప్టెంబర్ 2025

శుభ ఫలితాలు. కార్యజయం, అధికారిక లాభం, ఆర్థికంగా కొన్ని సానుకూల మార్పులు కనిపిస్తాయి.

అక్టోబర్ 2025

మధ్యస్థ ఫలితాలు. వ్యాపారంలో కొన్ని ఆటంకాలు, కానీ విద్యార్థులకు అనుకూలం.

నవంబర్ 2025

ప్రత్యేక జాగ్రత్త అవసరం. శత్రువుల పెరుగుదల, అనారోగ్యం, కుటుంబ కలహాలు.

డిసెంబర్ 2025

ఇబ్బందులు ఎదురవుతాయి. వృథా ప్రయాణాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి.

జనవరి 2026

మధ్యస్థంగా ఉంటుంది. ధనలాభం, రాజకీయ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రయాణాలు అనుకూలం.

ఫిబ్రవరి 2026

ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు. వ్యాపార లాభనష్టాలు సమంగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.

మార్చి 2026

అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ పరంగా మెరుగుదల, ఆకస్మిక ధనలాభం.

పరిష్కారాలు

గురు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం లాభదాయకం.

దక్షిణామూర్తి పూజ చేయడం ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

తాంబూలం, సెనగల ప్రసాదం ఆలయాల్లో పంచడం శుభం.

Latest Videos

vuukle one pixel image
click me!