Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అబద్ధాలు చెప్తే.. అసలు డౌటే రాదు!

Published : May 18, 2025, 03:07 PM IST

సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన కొందరు అమ్మాయిలు ఎక్కువగా అబద్ధాలు చెబుతారట. వీలైనంత వరకు అలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండటం మంచిదని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. మరి ఏ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు దూరంగా ఉండాలో ఇక్కడ చూద్దాం.  

PREV
14
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అబద్ధాలు చెప్తే.. అసలు డౌటే రాదు!

సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల స్వభావం, వారి భవిష్యత్ గురించి తెలుసుకోవచ్చు. ఏ నెలలో అయినా 3 తేదీల్లో పుట్టిన కొంతమంది అమ్మాయిలు అబద్ధాలు చెప్పడంలో దిట్టని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు ఇలాంటి లక్షణాన్ని కలిగి ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.

24
ఏ తేదీల్లో పుట్టిన వారు అబద్ధం చెబుతారు?

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా.. 4వ తేదీన జన్మించిన కొందరు అమ్మాయిలు తమ ఇమేజ్ కోసం అబద్ధాలు చెబుతారట. వారిని వారు తక్కువ చేసుకోవడానికి ఇష్టపడరట. ఈ తేదీల్లో పుట్టిన వారు ఇతరుల నమ్మకాన్ని గెలవడానికి ఎలాంటి అబద్ధాలైనా చెప్పడానికి వెనకాడరట. అలాంటి వారి మాటలు విని మోసపోవద్దని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.

34
ఈ తేదీల్లో పుట్టిన వారు మొండిగా ఉంటారు!

ఏ నెలలో అయినా 13వ తేదీన జన్మించిన కొంతమంది అమ్మాయిలు చాలా మొండిగా ఉంటారట. అబద్ధాలు చెప్పడంలో ముందుంటారట. వారు అనుకున్నది చేయడానికి ఎలాంటి అబద్ధం చెప్పడానికైనా వెనకడుగు వేయరట. ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.

44
అనుమానం రాకుండా అబద్ధాలు!

ఏ నెలలో అయినా 22వ తేదీన జన్మించిన కొందరు అమ్మాయిలు ఎదుటివారికి అనుమానం రాకుండా అబద్ధాలు చెబుతారని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. స్వలాభం కోసం వారు అబద్ధాలు చెబుతారట. అయితే 4, 13, 22 తేదీల్లో జన్మించిన ప్రతి ఒక్కరూ అబద్ధాలు చెప్పాలని లేదు. వారిలో కొంతమంది నిజాయితీపరులు కూడా ఉండవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories