Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆప్తుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి!

Published : Oct 09, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 09.10.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

313
వృషభ రాశి ఫలాలు

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

413
మిథున రాశి ఫలాలు

అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.

513
కర్కాటక రాశి ఫలాలు

ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి, వ్యా పారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

613
సింహ రాశి ఫలాలు

వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. శ్రమతో కానీ పనులు పూర్తి కావు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

713
కన్య రాశి ఫలాలు

ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

813
తుల రాశి ఫలాలు

ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

తల్లి తరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకున్న పనులు అనుకున్న టైంకి పూర్తి కావు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో తోటివారితో మాటపట్టింపులు ఉంటాయి. ఇంటా బయటా ఊహించని సమస్యలు వస్తాయి. వాహన ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.

1113
మకర రాశి ఫలాలు

సోదరుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. నూతన మిత్రుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. భాగస్వామి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో ఇతరుల నుంచి విమర్శలు అధికమవుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు చేస్తారు. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి.

1313
మీన రాశి ఫలాలు

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కీలక సమయంలో సన్నిహితుల సలహాలు కలిసివస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

Read more Photos on
click me!