Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నూతన వాహన యోగం!

Published : Oct 08, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 08.10.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

313
వృషభ రాశి ఫలాలు

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. నూతన వాహన యోగం ఉంది. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

413
మిథున రాశి ఫలాలు

వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు.

513
కర్కాటక రాశి ఫలాలు

దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

613
సింహ రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దాయదులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.

713
కన్య రాశి ఫలాలు

మిత్రుల కలయిక మరింత ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

813
తుల రాశి ఫలాలు

దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

913
వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం దక్కదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలించవు.

1113
మకర రాశి ఫలాలు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.

1313
మీన రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories