Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనప్రాప్తి.. ముఖ్యమైన పనులు పూర్తి!

Published : Mar 09, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 09.03.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తిచేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

313
వృషభ రాశి ఫలాలు

ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. కీలక విషయాలలో ఆలోచించి ముందుకు సాగాలి.

413
మిథున రాశి ఫలాలు

తల్లి తరపు బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నాయి. శ్రమకు తగిన ఫలితం దక్కదు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

513
కర్కాటక రాశి ఫలాలు

బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

613
సింహ రాశి ఫలాలు

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కంటి సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి.

713
కన్య రాశి ఫలాలు

నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు తీర్చగలుగుతారు.

813
తుల రాశి ఫలాలు

ఇంటా బయటా సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు వస్తాయి. సంతాన ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.

913
వృశ్చిక రాశి ఫలాలు

కొన్ని పనులు అనుకూలంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

1113
మకర రాశి ఫలాలు

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు

దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసిరావు. బంధు మిత్రుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక సమస్యలు వస్తాయి. ఉద్యోగాల్లో తోటివారితో మాటపట్టింపులు ఉంటాయి.

1313
మీన రాశి ఫలాలు

చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుంచి బయట పడతారు. ఆర్థిక విషయాలు అనుకూలం. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories