Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!

Published : Oct 06, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 06.10.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కలిసివస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. తండ్రి తరపు బంధువుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. భూ క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

413
మిథున రాశి ఫలాలు

బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయటా ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి. సంతానానికి నూతన విద్యా, ఉద్యోగవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వాహనాల ప్రయాణాలలో తొందరపాటు పనికిరాదు.

513
కర్కాటక రాశి ఫలాలు

ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు మందకొడిగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.

713
కన్య రాశి ఫలాలు

విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు మేలు చేస్తాయి.

813
తుల రాశి ఫలాలు

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. బందు మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. భూ, క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

నూతన మిత్రుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరులతో భూ వివాదాలు తీరి ఒప్పందాలు కుదురుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఉద్యోగాలలో అధికారులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

1113
మకర రాశి ఫలాలు

నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు రాజీ చేసుకుంటారు.

1213
కుంభ రాశి ఫలాలు

వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది.

1313
మీన రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో విందు, వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది. వివాదాలకు సంబంధించి దూర ప్రాంత బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories