ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. ఇంట్లో పిల్లల వివాహం గురించి ప్రస్తావన వస్తుంది.