నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నిరుద్యోగులకు ఉద్యోగం!

Published : Aug 29, 2025, 05:00 AM IST

ఈ రాశి ఫలాలు 29.08.2025 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులకు చికాకులు తప్పవు.

313
వృషభ రాశి ఫలాలు

ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

413
మిథున రాశి ఫలాలు

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అవసరానికి డబ్బు అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.

513
కర్కాటక రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

613
సింహ రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందదు. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

713
కన్య రాశి ఫలాలు

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. 

813
తుల రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.

913
వృశ్చిక రాశి ఫలాలు

గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఇంటా బయటా పరిస్థితులు చికాకు తెప్పిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. 

1013
ధనుస్సు రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక సమస్యల వల్ల అప్పులు చేస్తారు. బంధు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

1113
మకర రాశి ఫలాలు

నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్న నాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు

వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అప్పుల భారం పెరుగుతుంది. ఇంటా బయటా ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రతగా ఉండాలి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

1313
మీన రాశి ఫలాలు

ఆప్తులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభలు అందుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories