బుద్ధికుశలత, వ్యాపారం, విద్య, ఆర్థిక స్థితికి కారకుడైన బుధుడు.. సూర్యుడితో కలవడం వల్ల వృషభ రాశి వారికి మేలు జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో పదోన్నతి లభిస్తాయి. కుటుంబ సంబంధాలు బలపడతాయి. అప్పుల సమస్యలు తీరే అవకాశం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. సామాజిక గౌరవం పెరుగుతుంది. ధనలాభం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది.