Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ముల నుంచి ఊహించని సహాయం అందుతుంది!

Published : Nov 28, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 28.11.2026 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. దీర్ఘకాలిక రుణాల నుంచి విముక్తి కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

ఉద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. ముఖ్యమైన పనుల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగుతారు.

413
మిథున రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంతానంతో అకారణంగా కలహాలు కలుగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. రుణ ఒత్తిడి తలనొప్పి తెప్పిస్తుంది. దూరప్రయాణాల్లో శ్రమ తప్పదు.

513
కర్కాటక రాశి ఫలాలు

మిత్రులపై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేరు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు

అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహన యోగం ఉంది. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.

713
కన్య రాశి ఫలాలు

బంధు మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

813
తుల రాశి ఫలాలు

ఉద్యోగాలలో బాధ్యతలు సరిగ్గా నిర్వహించలేరు. చేపట్టిన పనులు మందగిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అంతగా కలసిరావు.

913
వృశ్చిక రాశి ఫలాలు

అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

అన్ని వైపుల నుంచి అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. అన్నదమ్ముల నుంచి ఊహించని సహాయం అందుతుంది.

1113
మకర రాశి ఫలాలు

ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఇతరుల నుంచి ఊహించని విమర్శలు వస్తాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. అనవసర వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

1213
కుంభ రాశి ఫలాలు

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.

1313
మీన రాశి ఫలాలు

ఇంటా బయటా కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మార్పులుంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు.

Read more Photos on
click me!

Recommended Stories