
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వాహన సంబంధిత వ్యాపారాలు లాభాల బాట పడతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కలిగినా తెలివిగా పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి.
వ్యాపార విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆదాయ వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. బంధు మిత్రుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
వృత్తి, వ్యాపారాలలో పై చేయి సాధిస్తారు. నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. పిల్లలు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ, వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డబ్బు వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
దీర్ఘకాలిక రుణాల నుంచి ఊరట లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. స్వల్ప ధన లాభ సూచనలు ఉన్నాయి.
సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తప్పవు. ఉద్యోగ వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలు ఉంటాయి.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. సన్నిహితులతో వివాదాలు సర్దుమణుగుతాయి. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగ విధులు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
దూర ప్రాంత బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాల్లో పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చెేయని పనికి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలుంటాయి. ఉద్యోగాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
కుటుంబ సభ్యుల నుంచి ఊహించని బహుమతులు అందుకుంటారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సంతానం విద్యా ఉద్యోగ అనుకూలం.
ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతానానికి సంబంధించిన విషయాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.