Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!

Published : Sep 20, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 20.09.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. దూర ప్రాంత బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

313
వృషభ రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో చిన్నపాటి చికాకులు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూర ప్రయాణాల వల్ల శ్రమ పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

413
మిథున రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల ప్రశాంతత ఉండదు. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

613
సింహ రాశి ఫలాలు

కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.

713
కన్య రాశి ఫలాలు

ఇంట్లో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

813
తుల రాశి ఫలాలు

విద్యార్థుల ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరటనిస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఇంటా బయటా బాధ్యతలు మరింత పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ అధికమవుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు మానసిక సమస్యలు కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు.

1013
ధనుస్స రాశి ఫలాలు

వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

1113
మకర రాశి ఫలాలు

సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. నూతన భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

1313
మీన రాశి ఫలాలు

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు చికాకు పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories