ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
213
మేష రాశి ఫలాలు
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
313
వృషభ రాశి ఫలాలు
కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి ఉంటుంది.
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో డబ్బు వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు పూర్తికావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు.
513
కర్కాటక రాశి ఫలాలు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. ఇతరుల నుంచి అవసరానికి సహాయం అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి.
613
సింహ రాశి ఫలాలు
సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.
713
కన్య రాశి ఫలాలు
జీవిత భాగస్వామితో గొడవలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంట్లో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
813
తుల రాశి ఫలాలు
కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టాలు తప్పవు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
913
వృశ్చిక రాశి ఫలాలు
సోదరుల సహాయంతో వివాదాల నుంచి బయట పడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.
1013
ధనుస్సు రాశి ఫలాలు
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయటా కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయాలు దర్శిస్తారు. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.
1113
మకర రాశి ఫలాలు
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు.
1213
కుంభ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. ఉద్యోగాలలో ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. రుణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి.
1313
మీన రాశి ఫలాలు
ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.