హిందూ మతంలో దీపావళి పండగకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ పండగ చీకటి పై వెలుగు, అబద్ధం పై సత్యం, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 20వ తేదీన జరుపుకోనున్నారు. ఈ పండగ రోజు ప్రత్యేక యోగాలు ఏర్పడనున్నాయి. దాదాపు 100 ఏళ్ల తర్వాత 5 రాజ యోగాలు ఏర్పడనున్నాయి. కేంద్ర త్రికోణ రాజయోగం, హంస రాజయోగం, బుధాదిత్య రాజయోగం, కుబేర యోగం, లక్ష్ీ యోగం ఏర్పడనున్నాయి. వీటి కారణంగా మూడు రాశులకు అదృష్టం కలగనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా...