Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి!

Published : Mar 15, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 15.03.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

313
వృషభ రాశి ఫలాలు

ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది.

413
మిథున రాశి ఫలాలు

ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

513
కర్కాటక రాశి ఫలాలు

సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు.

613
సింహ రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు కష్టం తప్పదు.

713
కన్య రాశి ఫలాలు

సంతానానికి నూతన విద్య అవకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. పాత మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

813
తుల రాశి ఫలాలు

ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలలో వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగాలలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు వస్తాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఇంటా బయటా ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. డబ్బు విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.

1113
మకర రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగులు తోటివారి సహాయంతో బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

1213
కుంభ రాశి ఫలాలు

అనుకున్న పనులు వేగంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.

1313
మీన రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories