Dream Astrology: స్వప్న శాస్త్రం ప్రకారం ఏ రోజు వచ్చిన కల ఎక్కువగా నిజం అవుతుందో తెలుసా?

Published : Mar 14, 2026, 05:18 PM IST

నిద్రలో కలలు రావడం సహజం. కొన్ని కలలు సాధారణంగా కనిపించినా, మరికొన్ని కలలు మనసులో సందేహాలను కలిగిస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కలల స్వభావం, సమయం, వచ్చిన రోజు ద్వారా వాటి అర్థాలను తెలుసుకోవచ్చు. మరి ఏ రోజు వచ్చిన కల ఎక్కువగా నిజమవుతుందో చూద్దామా..  

PREV
15
Dream Astrology

స్వప్న శాస్త్రం, జ్యోతిష్య పండితుల ప్రకారం ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది. కొన్ని కలలు మనసులోని ఆలోచనల ప్రతిబింబం అయితే మరికొన్ని కలలు భవిష్యత్తులో జరిగే సంఘటనలకు సూచనలుగా ఉంటాయి. ముఖ్యంగా ఏ రోజు లేదా ఏ సమయానికి వచ్చిన కల ఎక్కువగా నిజమవుతుందనే విషయం గురించి స్వప్న శాస్త్రంలో కొన్ని విశేషమైన అభిప్రాయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

25
3 నుంచి 5 గంటల మధ్య వచ్చే కలలు

స్వప్న శాస్త్రం ప్రకారం రాత్రి మొత్తం వచ్చే కలలు ఒకే విధంగా ఉండవు. రాత్రి మొదటి భాగంలో వచ్చే కలలు సాధారణంగా మన దైనందిన జీవితం, ఆలోచనలు, భయాలు, ఆశలు వంటి వాటి ప్రభావంతో వస్తాయి. కానీ రాత్రి చివరి భాగంలో, ముఖ్యంగా ఉదయం సమయానికి దగ్గరగా వచ్చే కలలు ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఆ సమయానికి మనసు ప్రశాంతంగా ఉండటం, శరీరం లోతైన నిద్రలో ఉండటం వల్ల కలలు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య వచ్చే కలలను చాలా ముఖ్యమైనవిగా జ్యోతిష్య పండితులు చెబుతారు.

35
ఆ రోజున చూసే కలలు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారంలో ప్రతి రోజుకు ఒక గ్రహాధిపత్యం ఉంటుంది. సోమవారం, చంద్రునికి సంబంధించింది. చంద్రుడు మనసు, భావోద్వేగాలు, కలలు వంటి వాటికి అధిపతి. కాబట్టి సోమవారం రాత్రి లేదా సోమవారం ఉదయం చూసే కలలు కొంతవరకు సంకేతాత్మకంగా ఉండవచ్చని పండితులు చెబుతున్నారు. అలాగే గురువారానికి గురుగ్రహం అధిపతి కావడం వల్ల ఆ రోజు చూసే కలలు ఆధ్యాత్మికత, జ్ఞానం లేదా శుభ ఫలితాలకు సంబంధించిన సంకేతాలుగా పండితులు చెబుతున్నారు.

45
కలలో ఇవి కనిపిస్తే?

స్వప్న శాస్త్రం ప్రకారం కల స్వభావం కూడా చాలా ముఖ్యమైంది. దేవాలయం, దేవతలు, స్వచ్ఛమైన నీరు, పువ్వులు, వెలుగు వంటి వాటిని కలలో చూడటం శుభ సూచనగా భావిస్తారు. మరోవైపు అగ్ని ప్రమాదం, చీకటి, పడిపోవడం, భయం వంటి కలలు కొన్నిసార్లు జాగ్రత్త సూచనలుగా చెప్తారు. అయితే ప్రతి కలను అక్షరాలా భవిష్యత్ సూచనగా తీసుకోవడం కంటే, దాన్ని ఒక సంకేతంగా మాత్రమే చూడాలని పండితులు చెబుతున్నారు.

55
ప్రశాంతంగా ఆలోచించడం

నిపుణుల ప్రకారం మన ఆరోగ్యం, మనసులో ఉన్న ఆలోచనలు, రోజువారీ అనుభవాలు కూడా కలలపై ప్రభావం చూపుతాయి. ఎక్కువగా ఆలోచించడం, భయం, ఆందోళన లేదా ఒత్తిడి ఉన్నప్పుడు కూడా విచిత్రమైన కలలు రావచ్చు. కాబట్టి ప్రతి కలను చూసిన వెంటనే భయపడకుండా, దాని గురించి ప్రశాంతంగా ఆలోచించడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories