ఈ భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ, తమకు జన్మనిచ్చిన తల్లి అంటే ప్రేమ, అభిమానం చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే.. న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు మాత్రం ఆ ప్రేమ మరింత ఎక్కువగా ఉంటుంది. వీరికి తండ్రి కన్నా తల్లి మీదే ప్రేమ చాలా ఎక్కువ. ఎంత అంటే... తల్లి ఏది చెబితే అదే వింటారు. పెళ్లి తర్వాత కూడా వీరి ప్రపంచం మొత్తం తల్లి చుట్టూనే తిరుగుతుంది. అమ్మ మీద చూపించిన ప్రేమలో పది శాతం కూడా భార్యపై చూపించరు. మరి, ఆ తేదీలేంటో చూద్దాం...
ఏ నెలలో అయినా 1, 2, 3, 6, 8, 12, 15, 20, 26, 28, 30 తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. తల్లిని చాలా ప్రేమిస్తారు. ఈ అబ్బాయిలు.. చాలా బాధ్యతగా ఉంటారు. జీవితంలో గొప్ప స్థాయికి వెళతారు. వారు ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా.. తల్లిని మాత్రం మర్చిపోరు. తమ పేరెంట్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రతి చిన్న విషయాన్ని తల్లితో పంచుకోవడం వీరికి చిన్నప్పటి నుంచి అలవాటు.