ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
213
మేష రాశి ఫలాలు
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
313
వృషభ రాశి ఫలాలు
ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసివస్తాయి.
ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. బంధు మిత్రులతో బంధాలు బలపడతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
513
కర్కాటక రాశి ఫలాలు
ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
613
సింహ రాశి ఫలాలు
ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. కుటుంబ విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
713
కన్య రాశి ఫలాలు
ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.
813
తుల రాశి ఫలాలు
చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
913
వృశ్చిక రాశి ఫలాలు
ఉద్యోగాలలో పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది.
1013
ధనుస్సు రాశి ఫలాలు
ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
1113
మకర రాశి ఫలాలు
ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది. ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
1213
కుంభ రాశి ఫలాలు
వ్యాపారాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది.
1313
మీన రాశి ఫలాలు
అదృష్టం కలిసివస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.