ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
213
మేష రాశి ఫలాలు
నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలు అందుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
313
వృషభ రాశి ఫలాలు
ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ, అధిగమిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి.
నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతాన వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
513
కర్కాటక రాశి ఫలాలు
మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
613
సింహ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.
713
కన్య రాశి ఫలాలు
ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.
813
తుల రాశి ఫలాలు
పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.
913
వృశ్చిక రాశి ఫలాలు
ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.
1013
ధనుస్సు రాశి ఫలాలు
ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు నిజమవుతాయి.
1113
మకర రాశి ఫలాలు
వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఆత్మీయుల సహాయ సహకారాలతో అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది.
1213
కుంభ రాశి ఫలాలు
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరాలకి సరిపడా ఆదాయం లేక అప్పులు చేయాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు లేక కొత్త సమస్యలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.
1313
మీన రాశి ఫలాలు
నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. అవసరానికి డబ్బు సహాయం లభిస్తుంది. ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.