Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారికి పుట్టుకతోనే అదృష్టం..వారు పట్టిందల్లా బంగారమే

Published : Mar 10, 2026, 05:39 PM IST

Birth Date: న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం నీడలా తోడు ఉంటుంది. వారు ఏది చేసినా లాభం తప్ప, నష్టం అనేదే ఉండదు. అన్నింట్లోనూ సక్సెస్ అవుతారు 

PREV
14
పట్టిందల్లా బంగారమే..

జోతిష్యం, న్యూమరాలజీ మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా, మనం పుట్టిన తేదీ ప్రభావం మనపై చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టడం సహజంగానే అదృష్టాన్ని మోసుకువస్తుంది. మరీ ముఖ్యంగా నాలుగు తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. నష్టాలు వచ్చే దాంట్లో వీరు దిగినా.. లాభాలు తీసుకురాగలరు. మరి, ఆ తేదీలేంటో చూద్దాం..

24
పుట్టిన తేదీ 5..

ఏ నెలలో అయినా 5వ తేదీలో జన్మించిన వారికి అదృష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో జన్మించిన వారు చాలా సాహసోపేతంగా ఉంటారు. వీరిపై బుధ గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో జన్మించిన వారు ప్రయాణాలు చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వీరికి స్నేహితులు ఎక్కువ. వీరు లైఫ్ లో తొందరగా సక్సెస్ అవుతారు.

34
పుట్టిన తేదీ 12..

ఏ నెలలో అయినా 12వ తేదీలో పుట్టిన వారికి కూడా పుట్టుకతోనే అదృష్టం ఎక్కువగా ఉంటుంది. వీరిపై గురు గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరిపై దైవ శక్తి కూడా ఉంటుంది. ఈ తేదీల్లో జన్మించిన వారు కళా రంగంలో ఎక్కువగా విజయాలు సాధిస్తారు. నిర్దిష్ట లక్ష్యంపై దృష్టి పెడితే.. ఖచ్చితంగా విజయం సాధించగలరు.

44
పుట్టిన తేదీ 24..

ఏ నెలలో అయినా 24వ తేదీలో జన్మించిన వారికి కూడా అదృష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి డబ్బు విషయంలో ఎప్పుడూ లోటు ఉండదు. కోరుకున్న ప్రేమ లభిస్తుంది. వీరిపై శుక్ర గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు ఇతరులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే.. సహాయం చేయడంలో ముందుంటారు.

పుట్టిన తేదీ 29..

ఏ నెలలో అయినా 29వ తేదీలో పుట్టిన వారు కూడా చాలా అదృష్టవంతులు. ఈ తేదీన జన్మించిన వారు తమ మనసులో అనుకున్నది సాధించాలనే సంకల్పం కలిగి ఉంటారు. సహజంగానే, అదృష్టం వారి వైపు ఉంటుంది, కాబట్టి వారు త్వరగా విజయం సాధిస్తారు. వారు ప్రతి సవాలును చాలా త్వరగా పరిష్కరిస్తారు. వారు ఎల్లప్పుడూ విజయంతో ముందుకు సాగుతారు.

Read more Photos on
click me!

Recommended Stories