2.కన్య రాశి...
కన్య రాశికి చెందిన పిల్లలు చాలా శాంతిప్రియులు. ముఖ్యంగా కన్య రాశికి చెందిన పిల్లలను దేవలతో పోలుస్తారు. వారు తమ పనిని తాము చేసుకుంటూ ఉంటారు. పక్కన వాళ్ల పనుల్లో జోక్యం చేసుకోరు. కాకపోతే.. ఈ రాశివారు మొండిగా, కాస్త కొంటెగా ఉంటారు. వీలైనంత వరకు నిశ్శబ్దంగా ఉంటారు. పేరెంట్స్ చెప్పిన మాట వింటారు. తమ చుట్టూ ఉన్నవారిని ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. తమ మాటలతో అందరి మనుసు గెలుచుకోవడంలో వీరు ముందుంటారు. కన్యను పాలించే గ్రహం అయిన బుధుడు కష్టపడి పనిచేయడాన్ని ప్రోత్సహిస్తాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ గ్రహాన్ని తెలివైన గ్రహం అంటారు. ఈ గ్రహం ఆశీర్వాదాల కారణంగా, కన్య పిల్లలు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. వారు చాలా కాలంగా నేర్చుకున్న వాటిని గుర్తుంచుకోగల శక్తిని కలిగి ఉంటారు. అందువల్ల, జ్యోతిషశాస్త్రం ప్రకారం, కన్యారాశి పిల్లలు విద్యలో ప్రశంసలు పొందుతారు.