సంపూర్ణ చంద్రగహ్రణం సెప్టెంబర్ 7వ తేదీన రాబోతోంది. దానికి ఒకరోజు ముందే గ్రహణ యోగం ఏర్పడబోతోంది. చంద్రుడు, రాహువుతో కలిసి ఈ గ్రహణ యోగాన్ని ఏర్పరచబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
మనసు కారకుడు చంద్రుడు. ఇతను నక్షత్రాన్ని చాలా తక్కువ సమయంలోనే మారుస్తాడు. సెప్టెంబర్ 6 ఉదయం 11:21కి చంద్రుడు రాహువుతో కలిసి గ్రహణ యోగాన్ని ఏర్పరచబోతున్నాడు. ఇది నాలుగు రాశుల వారికి కొన్ని ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఏర్పడి పూర్తియినా కూడా ఆ గ్రహణ యోగం ప్రభావం మాత్రం మూడు రోజుల వరకు ఉంటుంది. దాని దుష్ప్రభావాలు మాత్రం 15 రోజుల వరకు అనుభవించాల్సి రావచ్చు.
25
తులా రాశి
తుల రాశి వారు వచ్చే పదిహేను రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి గ్రహణ దోషం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మీ రహస్య శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. మీరు చేస్తున్న పనులు ఆగిపోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ 15 రోజుల పాటూ మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు.
35
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కూడా గ్రహణ యోగం కలిసిరాదు. రాహువు, చంద్రుడి కలయిక వీరికి అశుభ ఫలితాలను ఇస్తుంది. మీ మనస్సు నిండా అశాంతి నిండిపోతుంది. ఇంట్లో ఏదో విషయం గురించి గొడవ జరిగే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు. ఈ సమయంలో మీరు చాలా ఓర్పుతో ఉండాలి.
సింహ రాశి వారికి కూడా చంద్రగ్రహణం మంచి ఫలితాలను ఇవ్వదు. , రాహు-చంద్ర కలయిక వీరికి అశుభకరం. ఈ సమయంలో కొన్ని వ్యాధుల బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో వీరికి సవాళ్లు ఎదురు కావచ్చు. వ్యాపారం కూడా మెల్లగా సాగుతుంది. ఈ కాలంలో ప్రతి పనిని ఆలోచించి చేయడం మంచిది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి.
55
మీన రాశి
మీన రాశి వారికి గ్రహణం ఏమాత్రం మంచిది కాదు. ఖర్చులు ఎక్కువైపోతాయి. అప్పులు పాలయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 6 నుండి 9 వరకు ఏదైనా పెద్ద ఒప్పందాలు, పనులు చేయద్దు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టవద్దు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం క్షీణించవచ్చు.