ఆచార్య చాణక్యుడి నీతులు ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతారు. చాణక్యుడు.. భార్యా భర్తలు, స్నేహితులు, శత్రువులు, కుటుంబం గురించి చాలా విషయాలు బోధించాడు. చాణక్య నీతి ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలో మార్గనిర్దేశం చేస్తుంది. జీవితంలో విజయం సాధించాలన్నా, కష్ట సమయంలో ధైర్యంగా ముందుకు సాగాలన్నా చాణక్యుడి బోధనలు చాలా ఉపయోగపడతాయి. చాణక్య నీతి ప్రకారం పెళ్లైన మహిళ పరాయి మగవాడిపై ఎందుకు మనసు పడుతుందో ఇక్కడ చూద్దాం.
ఆచార్య చాణక్యుడు మహిళలు, పెళ్లి బంధం గురించి చాలా విషయాలు చెప్పాడు. సాధారణంగా చాలామంది పెళ్లయిన మహిళలు పరాయి పురుషుల వైపు ఆకర్షితులవుతుంటారు. ఎందుకు వారు అలా అట్రాక్ట్ అవుతారు? చాణక్య నీతి ఏం చెబుతోందో ఇక్కడ తెలుసుకుందాం.
భార్య తక్కువగా మాట్లాడితే?
ఆచార్య చాణక్యుడు పెళ్లి ప్రాధాన్యం గురించి చాలా బోధనలు చేశాడు. సాధారణంగా కొంతమంది ఆడవాళ్లు భర్తతో చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. చాణక్య నీతి ప్రకారం భార్య తన భర్తతో సంతోషంగా ఉంటే.. ఆమె చాలా తక్కువగా మాట్లాడుతుందట. అంటే ఆమెకు మాట్లాడటానికి ఇష్టం లేదని కాదు. ఆమె తన భర్తతో సంతోషంగా ఉందని అర్థమట.
24
భర్త నమ్మకద్రోహం చేసినప్పుడు
భర్త నమ్మకద్రోహిగా మిగిలిపోయినప్పుడు అతని భార్య చంచలమవుతుంది. ఎప్పుడు ఆమె భర్త ఆమెను దూరం చేయడం ప్రారంభిస్తాడో.. అప్పుడు ఆమె నిరాశతో భ్రమకు గురై మరొక పురుషుడి వైపు ఆకర్షితురాలవుతుంది. ఆమెను గౌరవించే మరొక పురుషుడు చాలా మంచి వాడని ఆమె భావించడం ప్రారంభిస్తుంది. అందుకే అలాంటి సందర్భాల్లో దంపతులు తమ సమస్యలను బహిర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలని చాణక్య నీతి చెబుతోంది.
34
భార్య కోపంగా ఉంటే?
చాణక్యుడి ప్రకారం భార్యాభర్తల్లో అప్పుడప్పుడు గొడవలు రావడం సహజం. కానీ ఈ వివాదాలు తరచుగా జరుగుతుంటే అది ఆందోళన కలిగించే విషయం. మీ భార్య ప్రతి చిన్న విషయానికి కోపంగా ఉంటే, ఆమె హృదయంలో అసంతృప్తి నిండి ఉందని అర్థం చేసుకోండి. అలాంటి సందర్భంలో భర్త తన భార్య స్వభావాన్ని అర్థం చేసుకోవాలి.
44
సమాన బాధ్యతలు
చాణక్య నీతి ప్రకారం, ఏదైనా దాంపత్య జీవితంలో బాధ్యతలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇద్దరు భాగస్వాములు ఇంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, పిల్లలను కలిసి చూసుకునేటప్పుడు, వారి మధ్య సఖ్యత బలంగా ఉండాలి. లేదంటే ఒకరిపై ఎక్కువ భారం పడుతుంది. ఇది వారిద్దరి మధ్య దూరాన్ని పెంచడానికి దారితీస్తుంది.