Zodiac Sign: ఈ రాశుల ధైర్యం తట్టుకోవడం అంత ఈజీ కాదు
మన రాశి ప్రకారం.. మన వ్యక్తిత్వానికీ, స్వభావానికీ సంబంధం ఉంటుంది. మరి, జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశికి చెందిన వారు ధైర్యవంతులు తెలుసుకుందామా...
మన రాశి ప్రకారం.. మన వ్యక్తిత్వానికీ, స్వభావానికీ సంబంధం ఉంటుంది. మరి, జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశికి చెందిన వారు ధైర్యవంతులు తెలుసుకుందామా...
ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికీ ఒక్కో వ్యక్తిత్వం ఉంటుంది. కొందరు అందరికీ నచ్చేలా తమ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటారు. మరి కొందరికి వారు పుట్టిన తేదీ, వారి రాశి, నక్షత్రం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని రాశుల వారు చాలా తెలివిగా ఉంటే, మరి కొన్ని రాశులవారు చాలా పిసినారుల్లా ఉంటారు. మరి, జోతిష్యశాస్త్రం ప్రకారం.. పుట్టుకతోనే ధైర్యవంతులైన రాశులేంటో తెలుసుకుందామా..
1.మేష రాశి..
జోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువ. వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువ. కుజుడు ఈ రాశికి అధిపతి. కుజుడు ధైర్యం, కోపం, సాహజం, విజయానికీ కారకుడు. అందుకే మేష రాశి వారికి కుజుడి ప్రభావం చాలా ఎక్కువ. ఈ రాశివారు తొందరగా ఎవరికీ భయపడరు. వాళ్ల ధైర్యంతోనే లైఫ్ లో విజయం సాధించగలుగుతారు. వీరిలో ఉన్న ఈ గుణాలే.. ఈ రాశివారు విజయం సాధించడానికి కారణం అవుతుంది
2.వృషభ రాశి..
వృషభ రాశి వాళ్ళు చాలా ధైర్యవంతులు. అంతేకాదు, ఈ రాశి వారు తమ బాధ్యతలను ఎప్పుడూ పక్కన పెట్టేయరు. తమ బాధ్యతలను తెలుసుకొని ముందుకు వెళుతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు ఏ కష్టాన్నైనా ఈజీగా దాటుతారు, కష్టానికి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటారు. దానికి తగ్గట్టు పరిష్కారం కూడా వెతుకుతారు.
3.సింహ రాశి..
సింహ రాశి పేరుకి తగ్గట్టుగానే ఈ రాశి వాళ్ళు చిన్నప్పటి నుంచే ధైర్యవంతులు. చిన్నప్పుడు వాళ్ళు ఆడే ఆటలు చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు దేనికీ భయపడరు అన్నట్టు ఉంటది వాళ్ళ బిహేవియర్. సూర్యుడు సింహ రాశికి అధిపతి. సాహసం, నియమం, ఉన్నత పదవి, ధైర్యం, నాయకత్వ లక్షణాలు సూర్యుడి నుంచి వస్తాయి. అందుకే ఈ రాశి వాళ్ళకి సూర్యుడి ప్రభావం వల్ల మరింత ధైర్యం వస్తుంది. సింహ రాశి వాళ్ళు చాలా తెలివైనోళ్ళు కూడా!
ధనస్సు రాశి..
గెలవడంలో ధనుస్సు రాశి వాళ్ళకి తిరుగులేదు. ఓటమిని అస్సలు తట్టుకోలేరు. అందుకే గెలవడం మీదే ఎక్కువ ఫోకస్ పెడతారు. దానికోసం ఎంత కఠిన నిర్ణయమైనా తీసుకుంటారు. బయటికి కఠినంగా కనిపించినా మనసులో చాలా మెత్తగా ఉంటారు. ఎలాంటి సమస్య వచ్చినా ఈజీగా ఫేస్ చేస్తారు. ఈ గుణమే వాళ్ళకి ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది.