పట్టు వస్త్రాలు ధరించి గుడికి వెళ్లడం మంచిది కాదా? కారణం ఏంటి? చాగంటి ప్రవచనంలో ఏం చెప్పారు?

Published : Oct 03, 2025, 03:00 PM IST

Chaganti Explains తెలుగువారు పట్టు వస్త్రాలను శుభ సూచికంగా భావిస్తారు. శుభకార్యాలకు,దేవాలయాలకు పట్టు బట్టలు కట్టుకుని వెళ్తుంటారు. కానీ పట్టుతో చేసిన వస్త్రాలు ధరించి గుడికి వెళ్ళడం, శుభకార్యాలు చేయకపోవడం మంచిది అంటున్నారు. నిజమెంత? 

PREV
14
పట్టు వస్త్రాలు శుభసూచికమా?

మన తెలుగువారికి పట్టువస్త్రాలతో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. పెద్దలు కానీ చిన్నలు కానీ.. హుందాగా కనిపించడానికి, ఎక్కువ డబ్బులు పెట్టి పట్టువస్త్రాలు కొంటుంటారు. శుభకార్యాలలో పట్టు పంచెలు, పట్టు లాల్చీలు ధరించడం చూస్తూనే ఉంటాం. ఇది మన తెలుగువారిలో కనిపిస్తుంటుంది. అయితే పట్టు వస్త్రాలు వాడటం ఎంతవరకూ సరైనది. అందులో ఆధ్యాత్మికత ఎక్కడ ఉంది. పట్టు వస్త్రాలు ధరించి ఆలయాలకు వెళ్లకపోవడమే మంచిదని అంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. అలా వెళ్ళకూడదు అంటున్నారు. ఈ విషయంలో నిజం ఎంత?

24
పట్టు వస్త్రాలు ధరించి గుడికి వెళ్లవచ్చా?

పట్టు వస్త్రాలు ధరించడం తప్పు కాకపోవచ్చు. కానీ ఆ బట్టలు వేసుకుని గుడికి వెళ్లడం, శుభకార్యాలు చేయడం పొరపాటే అంటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరావు. అందుకు గల కారణాలు కూడా ఆయన వివరంగా వెల్లడించారు. పట్టు వస్త్రాలను తయారు చేయడం కోసం లక్షల్లో పట్టు పురుగులను నుంచి పట్టు దారం సేకరిస్తుంటారు. అయితే ఇందులో తప్పేముందు అని అనుకోవచ్చు. కానీ అక్కడే జీవ హింస కనిపిస్తుంది.పట్టు పురుగులు కట్టుకున్న గూడును తీసేస్తే తప్పులేదేమో. లక్షల పురుగులను చంపి పట్టు సేకరించడం సరైనది కాదు అని ఆయన అంటున్నారు.

34
పట్టుదారం కోసం లక్షల పురుగుల బలి

పట్టు బట్టలు తయారు చేసే దారం ఎక్కడి నుంచి వస్తుంది. మల్బరీ ఆకులను పట్టుపురుగులకు ఆహారంగా వేస్తారు. ఆ ఆకులను కడుపునిండా తిన్న పురుగులు పట్టుదారం రిలీజ్ చేసి, ఓ గూడు కట్టుకుని వాటిలో హాయిగా నిద్రిస్తుంటాయి. అయితే ఆ పురుగులను ఏరివేయాలంటే ఆ గూడు కోయ్యాలి. అలా తియ్యడం ద్వారా దారం చెడిపోతుంది. అందుకే వాటిని వేడి వేడి నీటిలో పడేస్తారు. బయటకు రాలేక, వేడి నీటిలో ఆపురుగులు నరకం చూసి చనిపోతుంటాయి. అప్పుడు ఆ సన్నని దారం ఓ కంటెకు పెట్టి, చిన్నగా లాగుతుంటారు. అలా దారం అంతా బయటకు వచ్చిన తరువాత లోపలి పురుగులను గూడుతో సహా బయట పారేస్తుంటారు.

44
చాగంటి ఏమన్నారు

ఒక్క పట్టు పంచె తయారు చేయడం కోసం కొన్ని లక్షల పురుగులను ఇలా నరకం చూపించి చంపేస్తున్నారు. అందులో ఎంతో హింస దాగి ఉంది. అటువంటి వస్త్రాలను కట్టుకుని ప్రశాంతంగా గుడికి వెళ్లి రావడం సరైనది కాదు అని అన్నారు చాగంటి. అందుకే గుడికి వెళ్ళడానికి నూలు వస్త్రాలు కట్టుకుని వెళ్లడం ఎంతో మంచిది అంటున్నారు చాగంటి. ఆయన ప్రసంగానికి సబంధించిన వీడియో ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Read more Photos on
click me!

Recommended Stories