బల్లి అరిస్తే ఇంట్లో శుభమా అశుభమా? బల్లి శకునం లో నిజం ఎంత?

Published : Oct 03, 2025, 12:38 PM IST

ఇంట్లో బల్లులు ఉండటం సహజం. అవి శబ్ధాలు చేయడం కూడా సహజం. కానీ బల్లి శబ్ధం చేస్తే మంచి చెడులు చూస్తుంటారు పెద్దవారు. అసలు బల్లి అరిస్తే శుభం జరుగుతుందా? అశుభమా? బల్లి శాస్త్రం ఏం చెపుతుంది? అందులో నిజం ఎంత?

PREV
17
ఇంట్లో బల్లులు సహజం

ప్రతీ ఇంట్లో బల్లులు ఉండటం సహజం. అవి అప్పుడప్పుడు సడెన్ గా శబ్దాలు చేయడం కూడా సహజమే. కానీ బల్లులు అరిస్తే వాటి ద్వారా శుభాశుభాలు లెక్కలు వేస్తుంటారు పెద్దలు. అవి చేసే శబ్ధం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ప్రాంతాలను బట్టి మారుతుంటుంది. కానీ బల్లి చేసే శబ్దాన్ని పెద్దలు ఒక రకమైన సూచనలాగా భావిస్తారు. అయితే జ్యోతిష్యం ప్రకారం బల్లి చేసే శబ్దానికి, అది ఏదిక్కు నుంచి సౌండ్ చేస్తుందా అన్న దాని ప్రకారం రోజు తిధిని బట్టి రకరకాలుగా భావిస్తుంటారు. బల్లి శబ్ధాలను శకునంగా పరిగణిస్తారు.

27
లక్ష్మీదేవి ప్రతిరూపంగా

కొంత మంది బల్లిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. ఇంట్లో బల్లి కనిపించడం సంపద, అదృష్టాన్ని సూచిస్తుందని నమ్మకం. కంచిలాంటి కొన్ని భారతీయ ఆలయాల్లో బల్లులను పూజిస్తారు, వాటి నుండి ఆశీర్వాదాలు తీసుకుంటారు. మరికొంత మంది నిపుణులు మాత్రం అసలు బల్లిశాస్త్రం అనేది లేదు అని నిక్కచ్చిగా చెపుతుంటారు. అదిమనం క్రియేట్ చేసుకున్నదే అని కొంత మంది జోతిష్య నిపుణులు కూడా పలు సందర్భాల్లో చెప్పుతుంటారు.

37
బల్లి శకునం

ఇక బల్లి శకునం ఉంది అని నమ్మేవారు వాటి దిక్కును బట్టి ఆ సౌండ్ కు అర్ధం ఏంటో చెపుతుంటారు. బల్లి తూర్పు దిశలో శబ్దం చేస్తే అది మంచిది కాదు అని, అది కూడా ఆదివారం అలా అరిస్తే భయ సూచనగా భావిస్తారు. అదే బల్లి మంగళవారం తూర్పు దిశగా శబ్ధం చేస్తే.. ఇంట్లో సంపదను సూచిస్తుందట. అదే విధంగా పశ్చిమ దిశలో బల్లి శబ్దం చేస్తే మంచిదట. అది కూడా శుక్రవారం ఆ శబ్దం వింటే ఆనందం కలుగుతుందని పెద్దల నమ్మకం. కానీ అదే బల్లి గురువారం పశ్చిమంగా శబ్ధం చేస్తే అది అశుభంగా భావిస్తుంటారు. ఆరోజు ఆ శబ్ధం వల్ల నష్టం జరుగుతుందని అంటారు.

47
బల్లి శబ్దం వినిపిస్తే

ఉత్తర దిశలో బల్లి శబ్దం వినిపిస్తే డబ్బు లభించడం, నూతన వస్త్ర లాభం ఉంటుందట. ఆగ్నేయ దిశలో బల్లి శబ్దం వినిపిస్తే ఒకరోజు లాభం, మరొకరోజు నష్టం జరుగుతుందట. దక్షిణ దిశలో కూడా రోజులను బట్టి శకునం మారుతుందట. కొన్ని రోజులు ఆనందం, కొన్ని రోజులు అనారోగ్యం, శత్రు భయం పెరుగుతుంది అతని పెద్దల నమ్మకం. ఇక నైరుతి, వాయువ్య దిశల్లో బల్లి చేసే శబ్దం కూడా విభిన్న అర్థాలు కలిగిస్తుందని చెబుతారు. , మరికొన్ని రోజుల్లో బల్లి శబ్ధం వల్ల పనులకు ఆటంకం జరిగే అవకాశం ఉన్నట్టు చెబుతారు.

57
వ్యాపారంలో లాభం

ఇక ఈశాన్య దిశలోంచి బల్లి శబ్ధం వినిపిస్తు మంచి జరుగుతుంది అని పెద్దలు నమ్ముతారు. వాహన యోగం, పెళ్లి కాని వారు ఆ ఇంట్లో ఉంటే వివాహం సూచనలు, ఆహారం వృద్థి లాంటి శుభ సూచనలు ఉంటాయట. అంతేకాకుండా, బల్లి ఇంటి లోపల నేల దగ్గర శబ్దం చేస్తే, వ్యాపారంలో లాభం లేదా నష్టం వంటి ఫలితాలు ఉంటాయని చెబుతారు. ఇంటి పైకప్పుపై దూసుకుపోతే కూడా కొన్ని రోజులు విజయానికి, కొన్ని రోజులు విపత్తుకూ సూచనగా పరిగణిస్తారు.

67
బల్లి శుభం పలికింది

ఇక ఏదైనా నిన్ణయాలు తీసుకునే సమయంలో ఇంట్లో చర్చలు జరుగుతుంటాయి. ప్రతీ ఒక్కరు తమ వర్షన్ ను వినిపిస్తుంటారు. అయితే ఎవరైనా మాట్లాడేప్పుడు బల్లి శబ్దం చేస్తే వారు చెప్పేది నిజం అవుతుంది అని నమ్ముతారు పెద్దలు. బల్లి శుభం పలికింది అని నిర్ణయం తీసుకునేవారు కూడా ఉన్నారు. ఈ నమ్మకాలు శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, పంచాంగం ప్రకారం చాలామంది ఇప్పటికీ పాటిస్తారు. మనకు మంచిగా జరగబోయే పనులకైనా, జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలకైనా ఈ శకునాలను ఒక సూచనలాగా తీసుకోవడం అనేది వెనకట నుంచి వస్తున్నదే.

77
శాస్త్రీయ ఆధారాలు

ఇక ఫైనల్ గా చెప్పాలంటే, బల్లి శబ్దం ఎప్పుడు, ఎక్కడ, ఏ రోజు వినిపిస్తుందు అన్న విషయాన్ని బట్టి అది శుభమా, అశుభమా అనే ఫలితాన్ని పెద్దలు నిర్ణయిస్తారు. ఇది నమ్మకాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇప్పటికీ చాలా మంది బల్లి శకునాలను గౌరవంగా భావిస్తూ ఉంటారు. బల్లి అరుపులను బట్టి, అది శుభమా లేదా అశుభమా అనేది నిర్ణయిస్తుంటారు. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. బల్లి అరుపులను శుభంగా లేదా అశుభంగా పరిగణించడం అనేది వ్యక్తిగత విశ్వాసాలు, సాంస్కృతిక నేపథ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories