Zodiac Sign: గజకేసరి రాజయోగం.. ఈ 6 రాశులవారు కష్టాలనుంచి గట్టెక్కినట్లే!

Published : Oct 03, 2025, 02:13 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో గురు, చంద్రుల కలయిక జరగనుంది. దానివల్ల అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం 6 రాశులవారి జీవితాల్లో వెలుగులు నింపనుంది. మరి ఆ రాశులేంటో తెలుసుకుందామా.. 

PREV
17
గజకేసరి రాజయోగం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనసు, భావోద్వేగాలు, ఆరోగ్యం వంటివాటికి కారకుడైన చంద్రుడు.. జ్ఞానం, సంపద, అదృష్టం, ఆనందాలకు కారకుడైన గురువుతో కలిసి గజకేసరి రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. అక్టోబర్ 12న ఏర్పడనున్న ఈ గజకేసరి రాజయోగం చాలా బలమైనది. దీనివల్ల కొన్ని రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఊహించని ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మరి ఆ రాశులేంటో తెలుసుకుందామా..

27
వృషభ రాశి

వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగం శుభప్రదం. ఈ యోగం వృషభ రాశివారి జాతకంలో రెండవ ఇంట్లో ఏర్పడుతుంది. దానివల్ల నిలిచిపోయిన డబ్బు అకస్మాత్తుగా తిరిగి వస్తుంది. ఆగిపోయిన పనులు చకచకా పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ఎప్పటినుంచో వేధిస్తున్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

37
మిథున రాశి

మిథున రాశి వారికి గజకేసరి రాజయోగం మంచి రోజులు తెస్తుంది. ఈ యోగం ఈ రాశివారి జాతకంలో వివాహ గృహంలో ఏర్పడుతుంది. దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పెళ్లికాని వారికి మంచి సంబంధాలు రావచ్చు.

47
కర్కాటక రాశి

గురు, చంద్రుల గజకేసరి యోగం కర్కాటక రాశివారికి మేలు చేస్తుంది. భావోద్వేగాల పరంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడుతాయి. ఉద్యోగులకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. 

57
కన్య రాశి

కన్య రాశి వారికి గజకేసరి రాజయోగం శుభప్రదం. ఈ యోగం కన్య రాశి కర్మ గృహంలో ఏర్పడుతుంది. దానివల్ల వృత్తి, వ్యాపారాల్లో ఎప్పుడూ చూడని అభివృద్ధి చూస్తారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. 

67
తుల రాశి

తుల రాశివారికి గజకేసరి రాజయోగం ఆర్థిక స్థిరాత్వాన్ని ఇస్తుంది. మీ మాటకు ఇంటా బయటా విలువ పెరుగుతుంది. బందాలు బలపడుతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త కాంట్రాక్టులు, కస్టమర్లు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం రావచ్చు.

77
కుంభ రాశి

కుంభ రాశివారికి గజకేసరి రాజయోగం కొత్త గుర్తింపును తెస్తుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనువైన సమయం. చాలాకాలంగా పడుతున్న కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. స్థిరాస్తి సంబంధిత వ్యవహారాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories