నేడు కర్కాటక రాశివారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి!

Published : Sep 11, 2025, 07:00 AM IST

11.09.2025 గురువారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలాలు ఇవి. నేడు ఈ రాశివారికి ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

PREV
14
కర్కాటక రాశి ఫలాలు (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష)

నేడు కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...

24
ఆరోగ్యం

ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వారికి చిన్న చిన్న సమస్యలు చికాకు తెప్పిస్తాయి. మానసిక ఒత్తిడి, టైంకి ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి వంటివి శారీరక స్థితిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలలో ఆటంకాలు, అనారోగ్య సమస్యలు లేదా అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఉంది.

కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలు, అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంది. దానివల్ల ఇంటి వాతావరణం గందరగోళంగా మారవచ్చు. కాబట్టి ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోకుండా వచ్చిన సమస్యను పరిష్కరించడం ముఖ్యం. 

34
ఆర్థిక పరిస్థితి

ఆర్థికంగా సన్నిహితుల నుంచి ఆశించిన మద్దతు అందకపోవడం లేదా వారి నుంచే ఆర్థిక ఒత్తిడి రావడం వల్ల చాలా ఇబ్బంది పడతారు. పెట్టుబడుల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నిర్ణయాలు తక్షణ లాభాల కోసమే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం మంచిది.

44
ఉద్యోగం, వ్యాపారం

ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల మద్దతు లేకపోవడం, ఉన్నతాధికారులతో విభేదాలు రావడం వంటివి మీ మనోభావాలను దెబ్బతీస్తాయి. కానీ ప్రస్తుతం ఉద్యోగం మారడం అంత మంచిది కాదు. వృత్తి, వ్యాపారాల్లో మార్కెట్ మాంద్యం, భాగస్వామ్య విభేదాల వంటివి నిరాశ కలిగిస్తాయి. కానీ ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఈ పరిస్థితిని అధిగమించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories