కుజ దోషం ఉన్న వ్యక్తులు తమ భాగస్వామి పట్ల ఉంటే ఎక్కువ ప్రేమతో అయినా ఉంటారు. లేదంటే.. ఎప్పుడూ గొడవలు పడుతూ అయినా ఉండొచ్చు. పెళ్లి జీవితంపై ఎక్కువ ఆసక్తి ఉండదు. చిన్న విషయాలకే విసుగు చెందుతారు. ఎక్కువ సమస్యలకు దారితీసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. చివరకు విడాకులు దారితీసే అవకాశాలు ఉన్నాయి.
కుజ దోషానికి నివారణలు:
ఈ దోషానికి ఉత్తమ పరిష్కారం జాతక సరిపోలిక. వివాహం చేసుకునే పురుషుడి జాతకంలో కుజుడు 7వ లేదా 8వ ఇంట్లో ఉంటే, స్త్రీ జాతకంలో కూడా అదే స్థానం ఉండాలి. కుజుడు 2వ, 4వ లేదా 12వ ఇంట్లో ఉన్నప్పటికీ దీనిని పాటించాలి.