Zodiac Signs: పద్దెనిమిదేళ్ల తర్వాత సూర్య, కుజుల అరుదైన కలయిక, వీరికి రాజయోగమే

Published : Sep 20, 2025, 10:23 AM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు, సూర్యుడు ముఖ్యమైన గ్రహాలు. వీరిద్దరూ తులారాశిలో కలవబోతున్నారు. దీనివల్ల 3 రాశుల (Zodiac Signs) వారికి బీభత్సంగా కలిసి వస్తుంది. ఆ రాశులేవో తెలుసుకోండి. 

PREV
14
కుజ సూర్యుల మధ్య అనుబంధం

జ్యోతిష్యం ప్రకారం కుజుడు ధైర్యానికి, సూర్యుడు ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు. వీరిద్దరి మధ్య స్నేహభావం  కూడా ఉంటుంది. కాబట్టి వీరిద్దరి కలయిక ఎంతో మంచిది.  అక్టోబర్‌లో వీరి కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం, సంపద పెరుగుతాయి.

24
కన్యా రాశి

కన్యా రాశి వారికి సూర్య, కుజుల కలయిక వల్ల ఎన్నో ప్రయోజనాలు దక్కనున్నాయి. ఈ కలయిక మీ జాతకంలో రెండో ఇంట్లో జరుగుతుంది. కాబట్టి, మీకు ఆకస్మికంగా బీభత్సంగా కలిసివస్తుంది.  ధనలాభాలు కలుగుతాయి. అప్పుగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది.

34
ధనూ రాశి

ధనూ రాశి వారికి సూర్య, కుజుల కలయిక వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఈ కలయిక మీ రాశి నుంచి 11వ ఇంట్లో ఏర్పడుతుంది. ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది. పెట్టుబడుల వల్ల లాభం పొందుతారు.

44
మకర రాశి

మకర రాశి వారికి సూర్య, కుజుల కలయిక అనుకూలంగా ఉంటుంది. ఈ కలయిక మీ రాశిచక్రంలోని కర్మ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి మీకు వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీకు అన్ని విధాలా మంచే జరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories