Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు అందంగా, హీరోల్లా ఉంటారు..!

Published : Dec 17, 2025, 05:13 PM IST

Birth stars: జోతిష్యశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి వ్యక్తిత్వం, ఆకర్షణ, ముఖ కాంతీ అన్నీ జన్మ నక్షత్ర ప్రభావంతో ముడిపడి ఉంటాయి. కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు సహజంగా చాలా అందంగా, స్టైల్ గా, హీరోల్లా కనిపిస్తారు. ఆ నక్షత్రాలేంటో చూద్దాం.. 

PREV
13
1.మఘ నక్షత్రం....

మఘ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలకు రాజసం, గాంభీర్యం ఎక్కువగా ఉంటుంది. ముఖంలో ప్రత్యేకమైన కాంతి, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరు నడిచి వస్తుంటే రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది. వీరు ఎంత మందిలో ఉన్నా.. హీరోలా కనపడాతారు.

2.పూర్వ పాల్గుణి నక్షత్రం....

పూర్వ పాల్గుణి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు చూడటానికి చాలా చార్మింగ్ గా ఉంటారు. వీరు మాట్లాడే తీరు, నవ్వు, బాడీ లాంగ్వేజ్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ అబ్బాయిలకు ఫ్యాషన్ సెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చూడగానే హీరో మెటీరియల్ అనే బావన కలుగుతుంది.

23
3.రోహిణి నక్షత్రం..

రోహిణి నక్షత్రం అంటేనే అందానికి చిరునామా అని జోతిష్యంలో చెబుతారు. ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిల ముఖం చాలా అందంగా ఉంటుంది. కేవలం ముఖం మాత్రమే కాదు.. వారి కళ్లు, స్కిన్ టోన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. చాలా సాఫ్ట్ గా ఉంటారు. మెచ్యూరిటీ కూడా ఉంటుంది.

4.స్వాతి నక్షత్రం...

స్వాతి నక్షత్రానికి చెందిన అబ్బాయిలు చాలా మోడ్రన్ గా ఉంటారు. చూడగానే హీరో మెటీరియల్ అనే ఫీలింగ్ కలుగుతుంది. చాలా పొడవుగా ఉంటారు. స్టైలిష్ గా, కూల్ ఆటిట్యూడ్ తో ఉంటారు. వీరిని అందరూ ఇష్టపడతారు. అందరూ వీరి లుక్స్ కి ఆకర్షితులౌతారు.

33
5.అనురాధ నక్షత్రం....

అనురాధ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు చూడటానికి చాలా కూల్ గా కనిపిస్తారు. కానీ, బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. చాలా చార్మింగ్ గా ఉంటారు. వీరి లుక్స్ కూడా చాలా బాగుంటాయి. చూడగానే పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ లా కనిపిస్తారు.

6.ఉత్తర ఫల్గుణి నక్షత్రం....

ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. వీరి మాటల్లో మాధుర్యం, ప్రవర్తనలో గౌరవం ఉట్టి పడుతూ ఉంటుంది. ఈ అబ్బాయిలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి ఎవరైనా ఇట్టే ఎట్రాక్ట్ అయిపోతారు.

Read more Photos on
click me!

Recommended Stories