August Horoscope: ఆగస్టులో అరుదైన గ్రహ యోగం.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు!

Published : Aug 01, 2025, 04:00 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం తన స్థానాన్ని మార్చినప్పుడు లేదా ఇతర గ్రహాలతో కలిసినప్పుడు శుభ యోగాలను సృష్టిస్తుంది. త్వరలో మంగళ-శని గ్రహాలు కలిసి ప్రతి యుతి దృష్టి అనే ప్రత్యేకమైన యోగాన్ని ఏర్పరుస్తాయి. 

PREV
16
ప్రతి యుతి దృష్టి యోగం

జ్యోతిష్యం ప్రకారం రెండు గ్రహాలు ఒకదానికొకటి 180 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు ప్రతి యుతి దృష్టి యోగం ఏర్పడుతుంది. ఈ శక్తివంతమైన యోగం జీవితంలో శాశ్వత విజయం, శ్రేయస్సు, కర్మ ఫలాలను తెస్తుందని నమ్మకం. 

ఆగస్టు 9న మంగళ(కుజుడు), శని గ్రహాలు కలిసి ప్రతి యుతి దృష్టి యోగాన్ని ఏర్పరచనున్నాయి. ఈ యోగం 5 రాశులవారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మరి ఆ రాశులేంటో.. అందులో మీ రాశి ఉందో చెక్ చేసుకోండి.  

26
వృషభ రాశి

మంగళ, శని గ్రహాలు వృషభ రాశికి అధిపతులు. కాబట్టి ప్రతి యుతి దృష్టి యోగం ఈ రాశి వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు చకచకా పూర్తవుతాయి.

ఈ సమయంలో మీరు ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. 

36
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి మంగళ-శని యోగం చాలా శుభప్రదం. ఈ సమయంలో శుక్రని కృపతో కీర్తి, సంపద పెరుగుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి.

46
తుల రాశి

తుల రాశి వారికి మంగళ, శని గ్రహాల ప్రతి యుతి దృష్టి యోగం వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి. సంతోషంగా ఉంటారు. తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

56
మకర రాశి

మకర రాశి వారికి మంగళ-శని ప్రతి యుతి దృష్టి యోగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.  

66
మీన రాశి

మంగళ-శని ప్రతి యుతి దృష్టి యోగం మీన రాశి వారికి చాలా శుభప్రదం. ఈ యోగం శుభ ఫలితాల వల్ల ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారులకు ఈ సమయం కలిసివస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం దక్కుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories