August Rasi Phalalu: ఆగస్టు నెల ఏ రాశివారికి కలిసివస్తుందో తెలుసా?

Published : Aug 01, 2025, 07:00 AM IST

ఆగస్టు నెలకు సంబంధించిన ఈ రాశి ఫలాలను పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల మాస ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
112
మేష రాశి ఫలాలు

మేష రాశివారికి ఆగస్టు నెల మిశ్రమ ఫలితాలనిస్తుంది. నెల ప్రారంభంలో ఆర్థికంగా చిన్నచిన్న ఇబ్బందులు రావచ్చు. వాహన కొనుగోలుకు అవకాశాలున్నాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

212
వృషభ రాశి ఫలాలు

ఆగష్టు నెల వృషభ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. వాహన యోగం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. రియల్ ఎస్టేట్ రంగంలో విశేషంగా రాణిస్తారు.

312
మిథున రాశి ఫలాలు

మిథున రాశివారికి ఆగస్టు నెల కలిసివస్తుంది. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. భూ క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.  స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి.

412
కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశివారికి ఆగస్టు నెల శుభ ఫలితాలను ఇస్తుంది. ఎప్పటినుంచో ఉన్న కష్టాల నుంచి ఉపశమనం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు.

512
సింహ రాశి ఫలాలు

సింహ రాశి వారికి ఆగస్టు నెల మిశ్రమ ఫలితాలనిస్తుంది. కోపం, అసహనం పెరుగుతుంది. అనవసర వాదనలు జరుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోవచ్చు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఆఫీసుకు సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

612
కన్య రాశి ఫలాలు

కన్య రాశివారికి ఆగస్టు నెల అంతగా కలిసిరాకపోవచ్చు. ఆర్థికంగా కష్టాలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. అప్పులు చేయాల్సిన అవసరం వస్తుంది. సమయానికి డబ్బులు అందక ఇబ్బంది పడతారు. నిందలు మోయాల్సి రావచ్చు.  ప్రతి దినం ఒక పరీక్షలా ఉంటుంది.

712
తుల రాశి ఫలాలు

తుల రాశివారికి ఆగష్టు నెలలో గ్రహ స్థితులు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆస్తి దక్కుతుంది. అప్పులు తీరుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. వాహన యోగం ఉంది. ఉద్యోగులు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

812
వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారికి ఆగస్టు నెల మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థికంగా లాభం చేకూరుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

912
ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశివారికి ఈ నెల అంతగా అనుకూలించదు. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. కోపం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. పిల్లలకు సంబంధించిన కొన్ని విషయాలు చికాకు తెప్పిస్తాయి. స్నేహితుల వల్ల నష్టాలు జరిగే అవకాశాలున్నాయి. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

1012
మకర రాశి ఫలాలు

మకర రాశి వారికి ఆగస్టు నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారు ధైర్యంగా ముందుకు సాగుతారు. వాహన యోగం ఉంది. స్నేహితుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో బంధాలు బలపడతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగులు పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. విద్యార్థులకు సానుకూల ఫలితాలు ఉంటాయి.

1112
కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారికి ఆగస్టు నెల కలిసివస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు తలెత్తే అవకాశముంది. రాజకీయ రంగాల వారికి కొత్త పదువులు దక్కే అవకాశం ఉంది. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలం.

1212
మీన రాశి ఫలాలు

ఆగష్టు నెల మీనరాశి వారికి అంతగా కలిసిరాదు. ఈ రాశివారికి కష్టాలు, చికాకులు తప్పవు. ఇంటా బయట వీరి మాటకు ప్రాధాన్యం ఉండదు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. తల్లి తరపు బంధువులతో గొడవలు రావచ్చు.   

Read more Photos on
click me!

Recommended Stories