Published : Aug 27, 2025, 01:34 PM ISTUpdated : Aug 27, 2025, 03:41 PM IST
శని సంచారం, వినాయక చవితి పండుగ కలిపి కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను అందిస్తాయి. ముఖ్యంగా వృషభ, సింహ రాశులవారికి ఆస్తి పరంగా లాభాలు కలుగుతాయి. శని శుభ స్థానంలో ఉండటం వీరి జీవితంలో ధనలాభం పెరుగుతుంది.
శని భగవానుడు అంటే ఎంతో మంది భయపడతారు. అతడు కీడే చేస్తాడని అనుకుంటారు. నిజానికి ఆయన న్యాయ దేవుడు. ఒకరి పాపాలకు, పుణ్యాలకు తగిన ఫలితాన్ని ఇచ్చి శిక్షించే వ్యక్తి శని. శని సంచారం వల్ల జీవితంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. ముఖ్యంగా శని సంచారం సానుకూలంగా ఉంటే ఆస్తి, వాహనం, ఇల్లు, భూమి లాంటివి లభిస్తాయి.
25
వినాయక చవితి వల్ల
వినాయక చవితి రోజు శనిగ్రహం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో పుణ్యం దక్కుతుంది. వినాయకుడిని పూజిస్తే జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని శాస్రాలు చెబుతూనే ఉన్నాయి. వినాయకుడి చవితి రోజే శని గ్రహం సంచారం కారణంగా వృషభ, సింహ రాశులవారికి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వారికి అన్ని రకాలుగా అంతా మేలే జరుగుతుంది.
35
వృషభ రాశి
వృషభ రాశి వారికి శని దేవుడు ఎంతో మంచి చేస్తాడు. ప్రస్తుతం ధనుస్సు రాశి నుండి ఎనిమిదవ దృష్టి ద్వారా శని ఈ రాశి వారికి ఆర్థిక పురోగతిని కలిగిస్తున్నాడు. అదేవిధంగా గురువు కూడా లాభ స్థానంలో ఉన్నాడు. చాలా కాలంగా ఆగిపోయిన ఆస్తి సంబంధిత సమస్యలు నెరవేరుతాయి. జాతకంలో శుక్రుడు వృషభ రాశి అధిపతి. కాబట్టి వీరికి ఇల్లు, భూమి, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
వినాయక చవితి పూజ చేయడం వల్ల వృషభ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఆరోజు పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయాలి. పుచ్చకాయ ప్రసాదంగా నివేదించాలి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వీరి అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు తెలుపు.
సింహ రాశి వారికి శని ఆరవ స్థానంలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు. దీని వల్ల మీ శత్రువులపై మీరు విజయం సాధింస్తారు. సింహ రాశికి అధిపతి సూర్యుడు. కాబట్టి రాజకీయాల్లో ఉన్నవారు, వ్యాపారంలో ఉన్నవారు అందరికీ శని అనుగ్రహం కలుగుతుంది. ఆస్తి యోగం బలంగా ఉంది. కాబట్టి ఆస్తి దక్కే అవకాశం ఉంది.0
వినాయక చవితి రోజు సింహరాశి వారు నారింజ రంగు దుస్తులు ధరించి పూజ చేయాలి. కుడుములు నివేదన చేయడం కూడా చాలా మంచిది. దీనివల్ల ఇంట్లో ఆనందం నెలకొంటుంది. అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు నారింజ.
55
కలిసొచ్చే పండుగ
శని భగవానుడికి కష్టపెట్టడం, అనుగ్రహించడం రెండూ తెలుసు. వృషభ, సింహ రాశుల వారు శని అనుగ్రహం పొందే స్థితిలో ఉన్నారు. దానితో పాటు వినాయక చవితి పండుగ కూడా వీరికి కలిసి వస్తుంది. జీవితంలో చాలా కాలంగా ఉన్న కోరికలు నెరవేరి, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.