Birth Month : జ్యోతిష్యం ప్రకారం… కొన్ని నెలల్లో పుట్టిన వారు ప్రేమలో నిజాయితీగా ఉండరట. ఇలా ఏఏ నెలల్లో పుట్టినవారి ప్రేమను గుడ్డిగా నమ్మొద్దో ఇక్కడ తెలుసుకొండి… జాగ్రత్తగా ఉండండి.
Birth Month : మనిషికి నిజాయితీ ప్రాణం లాంటిది. కానీ కొందరిలో ఇది లోపిస్తుంది. కొందరిలో వారు పుట్టిన నెల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ఇలా కొన్ని నెలల్లో పుట్టినవారు ప్రేమలో నిజాయితీగా ఉండరని జ్యోతిష్యం చెబుతోంది. అలాంటి నెలలేవో తెలుసుకుందాం.
26
ఫిబ్రవరి
ఫిబ్రవరిలో పుట్టినవారు స్వేచ్ఛను, కొత్త అనుభవాలను కోరుకుంటారు. ప్రేమలో వీరు భావోద్వేగంతో ఉండరు… ఎప్పుడూ మార్పును ఇష్టపడతారు. ఈ స్వభావం వల్ల బంధంలో నిబద్ధత లేనివారిగా కనిపించవచ్చు. కానీ ఈ నెలలో పుట్టిన అందరూ ఇలాంటి స్వభావాన్నే కలిగివుండరు… కొందరు తమ ప్రేమ విషయంలో చాలా దృఢంగా ఉంటారు.
36
మే
మే నెలలో పుట్టినవారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి, అందరితో సులభంగా కలిసిపోతారు. ఇతరుల దృష్టిని ఆకర్షించే వీరి గుణం కొన్నిసార్లు అపార్థాలకు దారితీయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రేమలో నిజాయితీ లేనివారిగా అపనిందలు పొందవచ్చు. కానీ మే నెలలో పుట్టినవారంతా ఇలాగే ఉంటారని అనుకోవడం పొరపాటే.
జూలైలో పుట్టినవారు భావోద్వేగాలను అణచుకుంటారు… జీవితంలో ప్రతి క్షణం ఉత్సాహభరితంగా ఉండాలని కోరుకుంటారు. అందువల్లే వీరిని ఇష్టపడేవారు అదేస్థాయిలో ప్రేమను కోరుకుని నిరాశం చెందే అవకాశాలుంటాయి… కానీ వీరు ప్రేమించివారికి లోతైన అనురాగాన్ని చూపిస్తారు. వారి భావోద్వేగ మార్పులు అపార్థాలకు దారితీయవచ్చు.
56
అక్టోబర్
అక్టోబర్‌లో పుట్టినవారు ఇట్టే ఇతరులను ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉంటారు. అందరితో స్నేహంగా ఉండాలనే వీరి కోరిక భాగస్వామిలో అనుమానాలను రేకెత్తించవచ్చు. ప్రేమ లేదా దాంపత్య జీవితంలో అపార్థాలకు కారణం కావచ్చు.
66
ఇది కేవలం సాధారణ అంచనా మాత్రమే
ఇది కేవలం సాధారణ అంచనా మాత్రమే. వ్యక్తి ప్రవర్తన పుట్టిన నెలను బట్టి మాత్రమే ఉండదు. వ్యక్తిగత గుణాలు, అనుభవాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి దీన్ని సాధారణ సమాచారంగానే చూడాలి.
(గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, సాధారణ జ్యోతిష్య అంచనాల ఆధారంగా రాయబడింది. దీని కచ్చితత్వాన్ని ఏషియానెట్ తెలుగు నిర్ధారించదు. పూర్తి వివరాలకు జ్యోతిష్యులను సంప్రదించడం మంచిది)