Trigrahi Yoga : యాభై ఏళ్ల తర్వాత సింహరాశిలో త్రిగ్రహి యోగం, ఈ రాశులకు డబ్బే డబ్బు

Published : Sep 16, 2025, 11:50 AM IST

సింహరాశిలో అరుదైన త్రిగ్రహి యోగం (Trigrahi Yoga) ఏర్పడుతుంది. ఆ రాశిలో మూడు గ్రహాల కలయిక వల్ల ఇది ఏర్పడబోతోంది. దీనివల్ల మూడు రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది. ఆ మూడు రాశులు ఏవో తెలుసుకోండి.

PREV
14
త్రిగ్రాహియోగం

ప్రతి గ్రహం నిర్ధిష్ట సమయానికి రాశి మారుతూ ఉంటుంది. అవి ఇతర గ్రహా లతో కలిసి శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. త్వరలో50 ఏళ్ల తర్వాత సింహరాశిలో మూడు గ్రహాలు కలవబోతున్నాయి. దీని వల్ల త్రిగ్రహి యోగం ఏర్పడింది.  సింహరాశిలో సూర్యుడు, కేతువు  ఇప్పటికే సంచరిస్తున్నారు.  ఇప్పుడు శుక్రుడు కూడా సింహరాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడు, శుక్రుడు, కేతువుల కలయికతో సింహరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. =

24
ధనుస్సు రాశి

త్రిగ్రాహి యోగం వల్ల ధనుస్సు రాశి వారు అన్ని విధాలా లాభపడతారు. ఎందుకంటే సూర్యుడు, శుక్రుడు, కేతువుల కలయిక మీ రాశి నుంచి తొమ్మిదో ఇంట్లో ఏర్పడుతోంది. కాబట్టి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కార్యాలయంలో సమస్యలు తొలగిపోతాయి. పనిభారం తగ్గడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. 

34
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి త్రిగ్రాహి యోగం వల్ల మేలు కలుగుతుంది. ఈ యోగం మీ రాశి నుంచి వృత్తి, వ్యాపార స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి ఈ కాలంలో మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతిని చూస్తారు. కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులు  మంచి లాభాలను పొందుతారు. కొత్త ఒప్పందాలు, ప్రభుత్వ టెండర్లు, వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది.

44
కర్కాటక రాశి

త్రిగ్రాహి యోగంతో కర్కాటక రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి.  ధన స్థానంలో ఈ యోగం ఏర్పడటం వల్ల ధన ప్రవాహం పెరుగుతుంది. పెట్టుబడులను సులభంగా ఆకర్షిస్తారు. ఉద్యోగంలో మీ ఆలోచనలు ప్రశంసలు పొందుతాయి. కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories