Millionaire Mantras: ఈ 4 రహస్య మంత్రాలు పఠిస్తే చాలు..మీరు కోటీశ్వరులైపోతారు..చేతినిండా డబ్బే డబ్బు

Published : May 30, 2026, 07:33 PM IST

Millionaire Mantras: ఇంట్లో సిరిసంపదలు ఎల్లప్పటికీ వెల్లివిరియాలంటే హోమాలు, యజ్ఞాలు, పరిహారాలు కాదు చేయాల్సింది.. ఈ 4 రహస్య మంత్రాలను పఠించండి. ఇక డబ్బే డబ్బు. వాటి గురించి ఇక్కడ చూద్దాం.

PREV
15
ఆధ్మాత్మిక మార్గం ఎంచుకోవడం ఉత్తమం

ఆర్థికంగా స్థిరపడాలని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఎంత సంపాదించినా, ఎన్ని వ్యాపారాలు చేసినా ఇంట్లో ధనం నిలవక అవస్థలు పడుతుంటారు. ఖర్చులు తగ్గించుకున్నా ఫలితం కనిపించదు. మధ్యలో అనుకోని ఖర్చులు వెంటాడుతాయి. అలాంటి పరిస్థితుల్లో సంపాదనతో పాటు కొందరు ఆధ్యాత్మిక మార్గాలను కూడా అనుసరిస్తుంటారు. జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని సులభమైన పరిహారాలు, లక్ష్మీదేవికి సంబంధించిన ప్రత్యేక మంత్రాలను భక్తితో ఆచరిస్తే సానుకూల శక్తులు పెరిగి ఆర్థిక పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుందని నమ్మకం. మరి ఆ పరిహారాలు, మంత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

25
డబ్బు నిలవాలంటే ఈ మంత్రాలు పఠించండి

మన రోజువారీ జీవితంలో చేసే కొన్ని చిన్న మార్పులు, దానాలు ఇంట్లో డబ్బు కొరతను పూర్తిగా తొలగిస్తాయి. 

తాళంపూల కుంకుమ దానం: గురువారం రోజు సువాసనగల తాళంపూల కుంకుమను కొని, మరుసటి రోజు శుక్రవారం దగ్గర్లోని అమ్మవారి గుడిలో దానం చేయండి. ఇది ఇంట్లో శుభాలను కలుగజేస్తుంది. 

మహాలక్ష్మి అర్చన: వరుసగా 5 శుక్రవారాలు మహాలక్ష్మి అమ్మవారి సన్నిధికి వెళ్లి, మల్లెపూలతో అర్చన చేయించండి. దీంతో ఇంట్లో డబ్బు కష్టాలు క్రమంగా తగ్గుతాయి. 

అప్పుల భారం తగ్గడానికి: శుక్లపక్షంలో వచ్చే చిత్తా నక్షత్రం రోజున కామాక్షి అమ్మవారికి పట్టుచీర సమర్పించి మనస్ఫూర్తిగా పూజించాలి. ఇది మీ అప్పుల భారాన్ని, అడ్డంకులను తొలగించి సంపదను పెంచుతుంది. 

గోధుమ పిండి పరిహారం: ఇంట్లో వంటకు వాడే గోధుమ పిండిని మరపట్టించేటప్పుడు, అందులో 7 తులసి ఆకులు, 2 చిటికెల కుంకుమపువ్వు వేసి పట్టించండి. ఈ పిండి ఇంట్లో ఉన్నంతకాలం, మీకు డబ్బు కొరత అనే మాటే రాదు.

35
జీవితంలో సంపదను పెంచే సిద్ధుల స్తోత్రం
ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాక, పూజగదిలో దీపం వెలిగించాలి. తర్వాత ఒక ఆసనంపై నిటారుగా కూర్చొని, వెలుగుతున్న దీపం జ్వాలను చూస్తూ, కింద ఇచ్చిన సిద్ధుల స్తోత్రాలను ఏకాగ్రతతో పఠించాలి. ఓం అగస్తీశాయ నమః ఓం నందీశాయ నమః ఓం తిరుమూల దేవాయ నమః ఓం కరూర్ దేవాయ నమః ఓం రామలింగ దేవాయ నమః ఈ మంత్రాన్ని రోజూ ఒక్కసారైనా పూర్తి నమ్మకంతో జపించడం మంచిది. ఎక్కువసార్లు జపించినా తప్పులేదు. ఇది మీ కుటుంబంలో పేదరికాన్ని పోగొట్టి, సిరిసంపదలను అందిస్తుంది.
45
ఊహించని ధనలాభం కోసం రహస్య మంత్రం

మీరు ఎంత కష్టపడినా రావలసిన డబ్బు చేతికి అందకపోయినా, లేదా వ్యాపారంలో రావాల్సిన మొత్తం ఎక్కడైనా ఆగిపోయినా, ఈ రహస్య మంత్రం మీకు సహాయపడుతుంది

మంత్రం: "ఓం రీంగ్ వసి వసి ధనం పణం దినం దినం" 

జపించే విధానం: ఈ మంత్రాన్ని మంగళవారం మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 గంటల మధ్య (రాహుకాలంలో) ఉత్తర దిక్కుకు తిరిగి జపించాలి. మంత్రాన్ని జపించేటప్పుడు వెన్నెముక, మెడ నిటారుగా ఉంచాలి. మీకు డబ్బు రావాలనే సంకల్పాన్ని మనసులో బలంగా పెట్టుకుని ఈ మంత్రాన్ని జపించాలి.

55
ఉసిరికాయతో కార్యసిద్ధి, విజయం!

అలాగే, కార్యసిద్ధి పొందడానికి, జీవితంలోని అన్ని రంగాల్లో విజయం సాధించి వృద్ధిలోకి రావడానికి ఉసిరికాయను వాడవచ్చు. ఎందుకంటే ఉసిరికాయలో ఉండే ఆరు రుచులు ప్రతికూల శక్తులను తొలగించి, విజయాన్ని ఆకర్షిస్తాయి. పైన చెప్పిన సులభమైన పూజా విధానాలు, మంత్రాలను అచంచలమైన నమ్మకంతో పాటిస్తే, మీ జీవితంలో సిరిసంపదలు, లక్ష్మీ కటాక్షం వెల్లివిరుస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories