Vastu Tips: మీ భర్త తో తరచూ గొడవలు అవుతున్నాయా? ఇలా చేస్తే చాలు..!
వాస్తు ప్రకారం, ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల దంపతుల మధ్య సమస్యలు తగ్గుతాయట. ముఖ్యంగా పడక గది విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలట.
వాస్తు ప్రకారం, ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల దంపతుల మధ్య సమస్యలు తగ్గుతాయట. ముఖ్యంగా పడక గది విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలట.
ప్రతి ఇంట్లో భార్యభర్తల మధ్య గొడవలు జరగడం చాలా సహజం. మనమందరం మనుషులమే కాబట్టి, వైవాహిక సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ, కొందరికి ఈ గొడవలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.ఏకంగా విడాకులు తీసుకునేదాకా దారి తీస్తాయి. ఇంట్లో మనశ్శాంతి కూడా లేకుండా చేస్తూ ఉంటాయి. మీరు కూడా.. ఇంట్లో గొడవలతో మనశ్శాంతి కరువై బాధపడుతున్నారా? అయితే వాస్తు ప్రకారం, ఇంట్లో కొన్ని రకాల మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యలు తగ్గి, ఇంట్లో సంతోషం నెలకుంటుంది. మరి, ఆ వాస్తు చిట్కాలు ఏంటో చూద్దాం..
దంపతుల మధ్య సమస్యలకు కారణమయ్యే వాస్తు లోపాలు ఇవే..
మీ ఇంట్లో పడక గది సరైన దిశలో లేకపోయినా,దంపతుల మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.మీ ఇంట్లో మీకు సమస్యలు రాకుండా ఉండాలన్నా, ఒకరిపై మరొకరికి నమ్మకం పెరగాలన్నా.. మీ ఇంట్లో పడక గదిని ఎప్పుడూ నైరుతి దిశలోనే ఉంచుకోవాలి. అలా లేకపోతే.. వెంటనే నైరుతి వైపు మార్చుకోవడం మంచిది.
చాలా మంది తమ పడకగదిలో అద్దాలు పెట్టుకుంటూ ఉంటారు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ అద్దాలను బెడ్ కి ఎదురుగా మాత్రం ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల కూడా దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయట. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఇలా అద్దం మంచం ఎదురుగా ఉండి, దానిని తొలగించడం కష్టం అనుకుంటే కనీసం రాత్రిపూట మీరు దానిని ఏదైనా క్లాత్ తో కవర్ చేయాలి. ఇలా చేయడం వల్ల సమస్యలు తగ్గే అవకాశం ఉంది.
చాలా మంది తాము వాడని వస్తువులు, అసవరం లేనివి అన్నింటినీ తీసుకెళ్లి మంచం కింద స్టోర్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరిగి, సమస్యలు పెరగడానికి కారణం కావచ్చు. అందుకే.. అవసరం లేని వస్తువులు బయట పడేయండి. మంచం కింద పేర్చకండి.
ఈ పరిహారాలు కూడా ప్రయత్నించవచ్చు..
మీరు బెడ్ రూమ్ నైరుతి మూలలో ఒక జత లవ్‌బర్డ్స్ లేదా హంస విగ్రహాలను ఉంచాలి.
మీరు బెడ్‌రూమ్‌లో తాజా పువ్వులను ఉంచడానికి ప్రయత్నించవచ్చు. పువ్వులు తాజాగా ఉన్నాయని నిర్ధారించుకోండి. కృత్రిమ పువ్వులను నివారించండి.
వాయువ్య లేదా నైరుతి దిశలో మీరు సన్నిహితంగా ,ప్రేమగా ఉన్న జంట పెయింటింగ్ లేదా చిత్రపటాన్ని కూడా వేలాడదీయవచ్చు.
మీరు ,మీ భాగస్వామి తలలు దక్షిణం వైపుకు తిరిగి పడుకునేలా చూసుకోండి.
బెడ్‌రూమ్‌లో టీవీ ఉండకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. దంపతుల మధ్య సమస్యలు రావు.